హైకోర్టు తీర్పుతో గవర్నర్‌ తమిళిసైకి ఊరట.. కేసు ఏంటో తెలుసా.?

by  |
Tamilisai Soundararajan
X

దిశ, వెబ్‌డెస్క్ : పరువు నష్టం దావా కేసులో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. అత్యున్నత న్యాయస్థానం ఆమెపై దాఖలైన పరువునష్టం కేసును మంగళవారం కొట్టివేసింది. పరువునష్టం కేసు వివరాలు ఇలా ఉన్నాయి. తమిళిసై 2017లో తమిళనాడు బీజేపీ చీఫ్‌గా ఉన్న సందర్భంలో వీసీకే చీఫ్ తిరుమవళవన్‌పై సంచలన కామెంట్స్ చేశారు.

తిరుమవళవన్ దాదాగిరి చేస్తున్నారంటూ మీడియాలో ఆరోపించారు. ఈ నేపథ్యంలో తమిళిసై వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన వీసీకే సభ్యుడు తాలి కార్తికేయన్ కాంచీపురం కోర్టులో తమిళిసైపై పురువునష్టం దావా వేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు సౌందరరాజన్‌ను విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు పంపింది.

అయితే, సమన్లతోపాటు కేసును రద్దు చేయాలని కోరుతూ ఆమె మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం.. వాక్ స్వాతంత్ర్యం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉన్నప్పటికీ వాటికి పరిమితులు ఉన్నాయని సున్నితంగా హెచ్చరించింది. అనంతరం తమిళిసైపై నమోదైన కేసును కొట్టివేసింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed