మధ్యప్రదేశ్ గవర్నర్ పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స

by  |
మధ్యప్రదేశ్ గవర్నర్ పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స
X

దిశ, వెబ్ డెస్క్: అసలే ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెంది, విలయతాండవం చేస్తోంది. దానికి తోడు వర్షాకాలం కావడంతో ప్రజలు ఎక్కువగా వివిధ రకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇందులో భాగంగానే మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ ఆరోగ్యం క్షీణించింది. ఊపిరితిత్తులు, కాలేయం సరిగా పనిచేయకపోవడంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో, కుటుంబ సభ్యులు ఆయన్ను లక్నోలోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా గవర్నర్ ఆరోగ్యంపై డాక్టర్ రాకేశ్ కపూర్ మాట్లాడుతూ.. ఊపిరితిత్తులు, కాలేయం సరిగా పని చేయడం లేదని, ఆయన ఆరోగ్యం మరింత విషమించిందని చెప్పారు. ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

కరోనా వైరస్ మూలంగా ఇటీవల ఆయన స్వస్థలంలో 10 రోజులు గడిపేందుకు గత నెల 9న లక్నోకు టాండన్ వెళ్లారు. అనారోగ్యానికి గురైన ఆయన జూన్ 11న ఆసుపత్రిలో చేరారు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించగా ఆరోగ్యం మెరుగుపడి, డిశ్చార్జ్ అయ్యారు. రోజుల వ్యవధిలోనే ఆయన మళ్లీ తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. టాండన్ అనారోగ్యం నేపథ్యంలో యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్‌కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మధ్యప్రదేశ్ గవర్నర్ బాధ్యతలను అదనంగా అప్పగించారు.

Next Story

Most Viewed