మధ్యప్రదేశ్ సీఎం రాజీనామా!

by  |
మధ్యప్రదేశ్ సీఎం రాజీనామా!
X

భోపాల్ : మధ్యప్రదేశ్ సీఎం మీడియా సమావేశం వరకూ ప్రభుత్వానికి మెజార్టీ సభ్యుల మద్దతు ఉన్నదని కాంగ్రెస్ ఉద్ఘాటిస్తూ వచ్చింది. ‘ఫార్ములా 5’ అస్త్రాన్ని సీఎం కమల్‌నాథ్ ప్రయోగిస్తారని కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు. ఫార్ములా 5ని సీఎం ప్రెస్‌మీట్‌లో వివరిస్తారని తెలిపారు. కానీ, సీఎం ప్రసంగంలో తన ప్రభుత్వాన్ని బీజేపీ ఎలా అస్థిరపరిచే కుట్రలకు పాల్పడిందో వివరించారు. 15 ఏళ్లు బీజేపీ అధికారంలో ఉండగా ఏం చేసింది? 15 నెలల్లోనే కాంగ్రెస్ ఏమి చేయలేదని ప్రశ్నించారు. ప్రజల తీర్పును బీజేపీ వంచించిందని ఆరోపించారు. ఫ్లోర్ టెస్ట్‌లో పాల్గొని అవమానపడాలని భావించడం లేదని చెప్పారు. ముందస్తుగానే తాను రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. త్వరలోనే గవర్నర్ లాల్‌జీ టాండన్‌కు సీఎం కమల్‌నాథ్ తన రాజీనామాను సమర్పించనున్నారు.

Tags: madhya pradesh, cm resign, kamalnath, governor, floor test



Next Story