బంగాళాఖాతంలో ‘ అల్పపీడనం’

by  |
బంగాళాఖాతంలో ‘ అల్పపీడనం’
X

దిశ, న్యూస్​బ్యూరో: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడుతోంది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్​ మీదుగా వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. దక్షిణ గుజరాత్ నుంచి అల్పపీడన అనుబంధ ఉపరితల ఆవర్తనం వరకు దక్షిణ చత్తీస్‌గఢ్, విదర్భ, ఉత్తర మధ్య మహారాష్ట్ర మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది.

రుతుపవనాల ప్రభావంతో బుధవారం సాయంత్రం రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. ఈ నెల 7వరకూ మరి కొన్నిచోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్-పట్టణ, వరంగల్-గ్రామీణ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది



Next Story

Most Viewed