అంతరిక్షపు కలలు

by Ravi |
అంతరిక్షపు కలలు
X

పిల్లలంతా...ఓ లుక్కేయండి.

నిదుర పోతున్న రాతిరి

నిండు పున్నమి వెన్నెల మన

అమ్మ నవ్వులా ఎంత బాగుందో..!

నింగి నక్షత్రపు పూదోట పరిమళం

ఎంత సుగంధ భరితం..!

చీకటి చీలుస్తూ వుంటేనే

ప్రకాశానికి విలువ.

ఓటమి పై పట్టువదలని

యుద్ధమే గెలుపు సంబరం.

పిల్లలంతా..ఓ లుక్కేయండి.

చంద్రయాన్ విక్రమ్ ల్యాండర్ జాబిల్లి

ఉపరితలాన్ని ముద్దాడింది..!

లక్షల కిలోమీటర్లు గ్రావిటీని అధిగమిస్తూ..!

ఒకప్పుడు మన రాకెట్ భాగాలు

చిన్న సైజు సైకిల్ పై వెళ్ళేవి.

నేడు మన శాస్త్ర సాంకేతిక

ప్రయోగాలు గ్రహాంతరాలు దాటాయి..!

సుదూరం... సుదీర్ఘ పయనం తోడుగా

మన కళ్ళల్లో అంతరిక్షపు కలలు వుండాలి.

భవిష్యత్ తరాలకు అవి

విజయోత్సవాలు కావాలి.

పిల్లలంతా... ఓ లుక్కేయండి.

బుద్ధుడు ధ్యానపు జ్ఞానపు కిరణాలు

మన లేలేత హృదయాలను తాకుతున్నాయి..

హుస్సేన్ సాగరపు ఆనందపు అంచుల తీరాన..!

ఎంత సగర్వంగా అనంత విశ్వమే హాద్దుగా..

యావత్ జగతిని జాగృతం చేస్తుంది

మన త్రివర్ణ జాతీయ పతాకం.

స్వాతంత్ర్య సమర యోధుల సాక్షిగా..!

సత్యమేవ జయతే ప్రతిధ్వనిస్తున్న

మన మాతృభూమికి జైహింద్ చెబుదాం.

మన జెండాకు సెల్యూట్ చేద్దాం.

ఫిజిక్స్ అరుణ్ కుమార్

93947 49536

Next Story

Most Viewed