గెస్ట్ లెక్చరర్స్ ఓకే.. మరి నిరుద్యోగుల సంగతేంటి..?

by  |
గెస్ట్ లెక్చరర్స్ ఓకే.. మరి నిరుద్యోగుల సంగతేంటి..?
X

దిశ, హుజురాబాద్ : గెస్ట్ అధ్యాపకుల స్థానంలో రెగ్యులర్ లెక్చరర్లను భర్తీ చేయాలని నిరుద్యోగ సంఘర్షణ సమితి డివిజన్ సమన్వయ కర్త లింగ బత్తిని మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నప్పుడు గెస్ట్ లెక్చరర్లను నియమించడం సబబు కాదన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదన్నారు. కార్పొరేట్ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అందులో భద్రత కరువైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి జూనియర్ కాలేజీల్లో రెగ్యులర్ లెక్చరర్లను నియమించాని కోరారు.


Next Story

Most Viewed