నోటితో కాకుండా ముక్కుతోనే ఎందుకు ఊపిరి పీల్చుకోవాలి ? అధ్యయనాల్లో షాకింగ్ విషయాలు..

by Disha Web Desk 20 |
నోటితో కాకుండా ముక్కుతోనే ఎందుకు ఊపిరి పీల్చుకోవాలి ? అధ్యయనాల్లో షాకింగ్ విషయాలు..
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా మనిషి చేసే చర్యలను బట్టి తాను ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అన్న విషయాలను తెలుసుకోవచ్చు. అలాగే ఊపిరి పీల్చుకునే విధానాన్ని బట్టి కూడా ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనారోగ్యంగా ఉన్నారా తెలుసుకోవచ్చు. సాధారణంగా ప్రతిఒక్కరూ ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటారు. అప్పుడప్పుడు కొంతమంది నోటి ద్వారా కూడా శ్వాస తీసుకునేవారు ఉన్నారు. అయితే ఇటీవలి పరిశోధనలో తెలిపిన అధ్యయనాల్లో 61 శాతం మంది ప్రజలు నోటి ద్వారా శ్వాస తీసుకుంటారని తెలిపారు. నోటి ద్వారా శ్వాస తీసుకోవడం సాధారణమే అయినప్పటికీ ముక్కు ద్వారా శ్వాస తీసుకోవాలని పెద్దలు, ఆరోగ్య నిపుణులు చెప్పడం చాలా సార్లు వినే ఉంటాం. మరి ఈ విషయాల పై అధ్యయనాలు ఎలాంటి నిజాలను బయటపెడుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

శ్వాసకోశ వ్యవస్థ ముక్కు, నోటి నుండి మొదలవుతుంది. ఇది శ్వాసనాళాల ద్వారా, ఊపిరితిత్తుల ద్వారా కలుస్తుంది. ఇది శరీరంలో ఆక్సిజన్ ప్రవాహాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. ముక్కు, నోరు శ్వాస తీసుకోవడానికి రెండు మార్గాలుగా ఉపయోగపడతాయి. అయితే ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.

అమెరికన్ జర్నల్ ఆఫ్ ఫిజియాలజీ, రెగ్యులేటరీ, ఇంటిగ్రేటెడ్, కంపారిటివ్ ఫిజియాలజీలో ప్రచురించిన ఒక పరిశోధన ప్రకారం శ్వాస విధానం అనేది రక్తపోటు, హృదయ స్పందన రేటును ప్రభావితం చేస్తుందని వెల్లడైంది. నోటి ద్వారా కాకుండా ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉండి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని ఈ పరిశోధనలో తేలింది.

అధ్యయనంలో 20 మంది యువకులు..

ఈ అధ్యయనం చేసేందుకు 20 మంది ఆరోగ్యవంతులైన యువకులను తీసుకున్నారు. వారు విశ్రాంతి తీసుకునేటప్పుడు, వ్యాయామం చేసేటప్పుడు వారి ముక్కు లేదా నోటి ద్వారా మాత్రమే శ్వాస తీసుకోవాలని తెలిపారు. ఈ పరిశోధనలో ప్రతి సెషన్‌లో ప్రజల రక్తపోటు, రక్తంలో ఆక్సిజన్ స్థాయి, హృదయ స్పందన రేటును కొలిచారు. ప్రజలు విశ్రాంతి తీసుకునేటప్పుడు వారి ముక్కు ద్వారా ఊపిరి పీల్చుకుంటే వారి రక్తపోటు తక్కువగా ఉండి, హృదయ స్పందన రేటు కూడా మెరుగుపడుతుందని తెలిసిందన్నారు. విశ్రాంతి సమయంలో ముక్కు ద్వారా శ్వాస తీసుకునేటప్పుడు నాడీ వ్యవస్థ చురుకుగా పనిచేస్తుందని తెలిపారు.

వర్కవుట్ చేస్తున్నప్పుడు తేడా వస్తుందా ?

ఎక్కువగా ప్రజలు ఏదైనా బరువులు ఎత్తినప్పుడు, మెట్లు ఎక్కినప్పుడు, పరిగెత్తినప్పుడు లేదా వ్యాయామం చేసినప్పుడు నోటి ద్వారా శ్వాస తీసుకోవడం ప్రారంభిస్తారు. ఎందుకంటే ఆ సమయంలో గుండె చప్పుడు వేగంగా మారుతుంది. అందువల్ల నోటి ద్వారా శ్వాస తీసుకోవడం చాలా సాధారణం. కానీ వర్కవుట్స్ చేసేటప్పుడు కూడా ముక్కు ద్వారా మాత్రమే శ్వాస తీసుకోవాలని చెబుతారు. వ్యాయామం చేసేటప్పుడు ముక్కు లేదా నోటి ద్వారా శ్వాస తీసుకోవడంలో తేడా ఉండదని అధ్యయనాలు చెబుతున్నాయి.



Next Story

Most Viewed