రంజాన్ వేళ ఉపవాసం ఉండటం వెనుక అసలు రహస్యం ఇదే!

by Dishanational2 |
రంజాన్ వేళ ఉపవాసం ఉండటం వెనుక అసలు రహస్యం ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్ : ముస్లింలకు అత్యంత పవిత్రమైన పండుగ అంటే రంజాన్. ఈనెలలో ముస్లింలందరూ 30 రోజుల పాటు ఉపవాసదీక్ష చేస్తారు. అయితే ఈ మాసంలో వీళ్లు ఉపవాసం ఎందుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.ఈ ఏడాది రంజాన్ మార్చి 23 అంటే బుధవారం ప్రారంభమై ఏప్రిల్ 21 అంటే శుక్రవారంతో ఈద్ ఉల్ ఫితర్ తో ముగుస్తుంది. అయితే నెలవంక కనిపించే వరకు 29 నుంచి 30 రోజుల వరకు పవిత్ర మాసం ముగియదు. నెలవంక కనిపించగానే ఈ పండుగ ప్రారంభమవుతుంది

అయితే,రంజాన్ మాసంలో ఉపవాసం ఉండటం ఇస్లాం మతంలో అతి ముఖ్యమైన మత ఆచారాలలో ఒకటి. దీన్ని ఇస్లాం ఐదు మూలస్తంభాలలో ఒకటిగా పరిగణిస్తారు. అంతే కాకుండా ఈ మాసంలో ఉపావసం ఉంటే అల్లా దయ ఉంటుందని వారి నమ్మకం. ముస్లింలు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి, ఆహారం, నీరు, ఇతర శారీరక అవసరాలకు దూరంగా ఉంటారు. సూర్యాస్తమయం సమయంలో ఇఫ్తార్ అనే భోజనంతో ఉపవాస దీక్షను విరమిస్తారు. మళ్లీ తెల్లవారు జామున ఉపవాసాన్ని తిరిగి ప్రారంభిస్తారు. అయితే ఇలా ఉపావసం చేయడానికి వెనుక ఓ ముఖ్య ఉద్దేశ్యం ఉందంట. అది ఏమిటంటే? ఉపవాసదీక్ష అంటే కేవలం ఘన,ద్రవ పదార్ధాలకు దూరంగా ఉంటమే కాకుండా, మన జ్ఞానేంద్రియాలను నియంత్రణలో ఉంచడం. దీక్షలో ఉన్నప్పడు నోటితో అబద్దాలాడరాదు,చెవులద్వారా చెడు వినరాదు,కళ్లతో అశ్లీలం వంటిని చూడరాదు,మనం చేసే ప్రతి చర్య సన్మార్గంలో ఉండే విధంగా చూడటం.నెల రోజుల పాటు ఇలాంటి కఠోర నిమయం పాటించట వలన.. ఏడాదిలో మిగిలిన 11 నెలలు పవిత్రమైన జీవినాన్ని కొనసాగించేందుకు ప్రేరణ కల్లుతుంది. తద్వారా ఆధ్యాత్మిక జీవనం కొనసాగించేందుకు మార్గం సుగమం అవుతుందంట

Also Read...

క్రాన్ బెర్రీలు రోజూ తింటే కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?

Next Story

Most Viewed