ఇంటి నిర్మాణానికి శంకుస్ధాపన ఎవరు చేయాలి..? కోడలా.. కూతురా..?

by Disha Web Desk 20 |
ఇంటి నిర్మాణానికి శంకుస్ధాపన ఎవరు చేయాలి..? కోడలా.. కూతురా..?
X

దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లి చేసి చూడు, ఇళ్లు కట్టి చూడు అన్న నానుడి పూర్వం నుంచి ఉంది. అయితే చాలా మంది వారి సొంతింటి కళను నెరవేర్చుకునేందుకు ఎంతో కష్టపడతారు. రూపాయి రూపాయి పోగు చేసుకుని ఎన్నో ఆశలతో ఇంటి నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. ఇంటి నిర్మాణం ప్రారంభించడానికి ముందు మంచి ముహూర్తం చూపించి శంకుస్ధాపన చేస్తారు. అయితే ఈ విషయంలోనే చాలా మందికి ఓ సందేహం ఉంది. అసలు ఇంటికి శంకుస్ధాపన కోడలు చేయాలా, కూతురు చేయాలా అని సందేహిస్తారు. మరి ఈ సందేహానికి పరిష్కారం ఏంటో ఇప్పుడు చూద్దాం..

కొంత మంది నిపుణులు, పండితులు ఏం చెబుతున్నారంటే ఇంటి నిర్మాణానికి శంకుస్ధానను కూతురితో కంటే కోడలితో చేయించడం మంచిదని. ఎందుకంటే మెట్టినింటికి వచ్చిన కోడలు వారి కుటుంబంలో ఓ సభ్యురాలు, యజమాని తరువాత తానే యజమానురాలు అవుతుంది, కానీ కూతురు పుట్టింటి నుంచి మెట్టినింటికి వెలుతుంది. ఆ ఇంటికి తాను బంధువుగానే అవుతుంది. ఆడబిడ్డ పెళ్లికాగానే మరొక ఇంటి మహాలక్ష్మి. అందుకే ఇంటి నిర్మాణానికి శంకుస్ధాపన ఇంటికి వచ్చిన కోడలితో చేయిస్తే మంచిదంటారు.

అలాగే శంకుస్ధాపనను పురోహితులు నిర్ణయించే ముహూర్తంలోనే తూచా తప్పకుండా ముగించాలి. అలాగే గృహప్రవేశం కూడా ఖచ్చితమైన ముహూర్తంలోనే దేవుని ఫొటోతో గృహంలోకి ప్రవేశించాలి. అనంతరం ఏదైనా పూజా కార్యక్రమాలను జరుపుకోవచ్చు. ఇకపోతే ఇంటి నిర్మాణాన్ని ఖచ్చితమైన వాస్తుతో కట్టించాలి. ఇంటికి సరైన దిశలో సింహద్వారాన్ని పెట్టాలి.

Read More: భయంకరమైన కలలు ఎప్పడు పడుతాయంటే..?

Next Story

Most Viewed