తెల్ల ఉల్లిపాయలతో ఆ సమస్యలను తగ్గించుకోవచ్చు!

by Disha Web Desk 10 |
తెల్ల ఉల్లిపాయలతో ఆ సమస్యలను తగ్గించుకోవచ్చు!
X

దిశ, ఫీచర్స్: మనం సాధారణంగా అన్ని కూరల్లో ఉల్లిపాయలను వేసుకుంటాము. కొంతమంది అయితే ఇది లేనిదే కూరలు కూడా చేయరు. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. దీనిలో విటమిన్ సి, పొటాషియం మరియు ఫైబర్ ఉంటాయి. తెల్ల ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అవి కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. వీటి వలన మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏంటో ఇక్కడ చూద్దాం..

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

తెల్ల ఉల్లిపాయలలో ఉండే ఫ్లేవనాయిడ్, రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి, ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది

తెల్ల ఉల్లిపాయల్లోని విటమిన్ సి జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

వీటిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది.


Read More..

క్యాప్సికమ్స్ తో ఈ వంటకాలు కూడా చేయవచ్చు.. అవేంటంటే?

Next Story

Most Viewed