సెక్స్ టైమ్‌లో డిస్టర్బ్‌ చేస్తున్న మెసేజ్‌లు, నోటిఫికేషన్లు.. శాటిస్‌ఫాక్షన్ లేకపోవడంతో..

by Dishafeatures3 |
సెక్స్ టైమ్‌లో డిస్టర్బ్‌ చేస్తున్న మెసేజ్‌లు, నోటిఫికేషన్లు.. శాటిస్‌ఫాక్షన్ లేకపోవడంతో..
X

దిశ, ఫీచర్స్: ‘Technoference’.. టెక్నాలజీ ఇంటర్‌ఫియరెన్స్ వల్ల మానవ సంబంధాల్లో కలిగే విభేదాలు, బాధలు. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ సాధారణమైపోయింది. స్టేటస్ సింబల్‌గా మారింది. పది మందిలో ఉన్నప్పుడు స్క్రీన్స్ చూడటం, కాల్స్ మాట్లాడటం స్టైల్ అయిపోయింది. అయితే ఇదే పద్ధతి మన ఆత్మీయులతో అత్యంత ముఖ్యమైన విషయాలు షేర్ చేసుకుంటున్నప్పుడు జరిగితే.. మెసేజ్, నోటిఫికేషన్ కారణంగా చర్చిస్తున్న విషయాన్ని మరిచి ఫోన్‌పై కాన్సంట్రేట్ చేస్తే.. తమను పట్టించుకోవట్లేదని, ప్రాధాన్యత ఇవ్వట్లేదనే బాధ పెరిగిపోతుంది. ఇదే పదే పదే జరిగితే.. భార్యాభర్తల్లో గొడవలు, విడాకులకు కారణం అవుతుంది. పిల్లల్లో డిప్రెషన్‌కు దారితీస్తుంది.

నిజానికి ఒక బంధం బలపడాలంటే క్లోజ్‌నెస్ చాలా ఇంపార్టెంటెంట్. తల్లిదండ్రులతో ఏదైనా చెప్పుకోవాలనుకున్నా.. భార్యా లేదా భర్తతో ఏ విషయాన్ని పంచుకోవాలనుకున్నా.. ముందు వారు మనం చెప్పే మాటలను శ్రద్ధగా వింటేనే కంటిన్యూ చేయగలం. మనం చెప్పాలనుకుంది ఫాలో అవుతారు లేదా యాక్సెప్ట్ చేస్తారనే నమ్మకం కుదురుతుంది. కానీ ఆ సందర్భంలో ఫోన్, ల్యాప్‌టాప్ లాంటి టెక్నాలజీ వీరి మధ్య ఇంటర్‌ఫియర్ అవుతుంది. బంధం బలహీనమయ్యేలా చేస్తుంది.

ముఖ్యంగా దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడు కూడా ఇలాంటి నోటిఫికేషన్స్‌ డిస్టర్బ్ చేస్తున్నాయి. పార్టనర్స్‌ కోపానికి కారణం అవుతున్నాయి. శారీరక సంతృప్తి లేక కొన్ని సందర్భాల్లో డైవోర్స్‌కు దారితీస్తున్నాయి. ఇక పిల్లల విషయానికి వస్తే డెవలప్మెంట్ అబ్‌నార్మాలిటీస్ చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పేరెంట్స్ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్స్ తగ్గిపోయి.. లాంగ్వేజ్ డెవలప్మెంట్‌పై ఎఫెక్ట్ చూపుతుంది. తాము నెగ్లెక్ట్ చేయబడుతున్నామని, ప్రియారిటీ ఇవ్వట్లేదని కుంగిపోతున్నారు. అందుకే మన ఇల్లు మానసికంగా సురక్షితమైన ప్రదేశాలుగా మారాలని సూచిస్తున్నారు నిపుణులు. కుటుంబ సభ్యులు తమ పరిస్థితుల గురించి తెలిపేటప్పుడు ప్రెజెన్స్, ఫోకస్ అవసరం అంటున్నారు. అంతేకానీ టెక్నాలజీ డివైజెస్‌తో ఆ స్థలాన్ని భర్తీ చేయకూడదని.. లేదంటే పరిణామాలు భిన్నంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

Next Story

Most Viewed