మైండ్ డైట్ ఫర్ చిల్డ్రెన్

by Disha Web Desk 10 |
మైండ్ డైట్ ఫర్ చిల్డ్రెన్
X

దిశ, ఫీచర్స్: పిల్లలు ఏ ఫుడ్ తింటారు? ఏం తినరు? అనేది వారి గ్రోత్‌లో కీలకపాత్ర పోషిస్తుంది. మారుతున్న ఆహారపు అలవాట్లతో చిన్నప్పుడే ఓవర్ వెయిట్, డయాబెటిస్ లాంటివి దరిచేరుతుండగా.. ఈ టైమ్‌లో న్యూ హెల్తీ ఫుడ్ ట్రెండ్ పుట్టుకొచ్చింది. మైండ్ డైట్ లేదా మెడిటరేనియన్-డాష్ డైట్ ఇంటర్వెన్షన్ గురించి ఈ మధ్య భారీగా చర్చలు జరుగుతున్నాయి. సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించే ఆహారం నిస్సందేహంగా పిల్లల అభిజ్ఞా వికాసానికి, జ్ఞాపకశక్తికి ఉపయోగపడుతుండగా.. స్కూల్‌కు వెళ్లే పిల్లల్లో బ్రెయిన్ హెల్త్, నాలెడ్జ్‌పై మైండ్ డైట్ సానుకూల ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు.

* మెదడు ఆరోగ్యం, మెరుగైన జ్ఞాపకశక్తికి ఫైబర్ అధికంగా ఉండే ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, గింజలు, చేపలు, ఆలివ్ ఆయిల్ వంటివి చేర్చాలి.

* పిల్లల ఆహారంలో కూరగాయలు.. ముఖ్యంగా బచ్చలికూర, కాలే, బ్రోకలీ వంటి ఆకుకూరలు, తాజా కూరగాయలను చేర్చి స్నాక్స్‌గా అందజేయాలి. వాటిని శాండ్‌విచ్‌లు, సూప్‌లలో చేరిస్తే ఎంజాయ్ చేస్తూ తినే అవకాశముంది.

* రోజంతా బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచడం మూలంగా మెదడు సరిగ్గా పనిచేస్తుంది.

* అనారోగ్యకరమైన కొవ్వులు, శుద్ధి చేసిన చక్కెరలు అధికంగా ఉండే ప్రాసెస్ చేసిన ఆహారాన్ని పిల్లలకు ఇవ్వకూడదు. షుగర్, ప్రాసెస్డ్ ఫుడ్.. వారి మానసిక ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి.

* మొక్కల ఆధారిత ప్రోటీన్, ఫైబర్ జోడించడానికి.. బీన్స్, కాయధాన్యాలు, చిక్‌పీస్‌లను ప్రధాన వంటలలో చేర్చండి.

* తృణధాన్యాల కోసం క్వినోవా లేదా గోధుమ రొట్టె వంటివి చిన్నారులకు ఇవ్వండి.

* మైండ్ డైట్ జ్ఞాపకశక్తి, మెదడు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ.. క్రమం తప్పకుండా వ్యాయామం, తగినంత నిద్ర సహాయపడతాయని గుర్తుంచుకోవడం ముఖ్యం. ఎప్పటిలాగే మీ పిల్లల నిర్దిష్ట పోషకాహార అవసరాలు, ఆరోగ్య స్థితి ఆధారంగా పర్సనల్ డైట్‌ను ఫాలో అయ్యేందుకు శిశువైద్యుడు లేదా రిజిస్టర్డ్ డైటీషియన్‌ను సంప్రదించడం మంచిది.

Read More : రోజూ ఎక్కువగా నీరు తాగడం కూడా ప్రమాదమేనా?Next Story

Most Viewed