Yoga : ద్విపాద పద్మ ఊర్ధ్వముఖ పశ్చిమోత్తనాసనం ప్రేయోజనాలేంటి?

by Disha Web Desk 6 |
Yoga : ద్విపాద పద్మ ఊర్ధ్వముఖ పశ్చిమోత్తనాసనం ప్రేయోజనాలేంటి?
X

దిశ, ఫీచర్స్: మొదటగా బల్ల పరుపు నేలపై రెండు కాళ్లు ముందుకు చాచి కూర్చోవాలి. తర్వాత మోకాళ్లను మడిచి పాదాలను పిరుదులకు దగ్గరగా తీసుకురావాలి. ఇప్పుడు మొదట ఎడమ కాలి పాదాన్ని రెండు చేతులతో పట్టుకుని పైకెత్తాలి. తర్వాత ఎడమ చేతితో ఎడమ కాలిని పట్టుకుని కుడి చేతితో కుడి కాలు పాదాన్ని పైకెత్తాలి. ఇప్పుడు రెండు పాదాలను సమాంతరంగా చేయాలి. రెండు కాళ్ల బొటన వేళ్లను ఆకాశం వైపు చూపిస్తూ లాగుతుండాలి. రెండు చేతులతో కాళ్ల పదాల వెనక పట్టుకుని మోకాళ్లను తలకు ఆన్చాలి. ఈ భంగిమలో వెన్నుముక, పైకెత్తిన కాళ్లు నిటారుగా ఉండేలా చూసుకోవాలి.

ప్రయోజనాలు

* ఉదర, నడుము కండరాలను టోన్ చేస్తుంది.

* పాదాలు, తొడలు, పిరుదులకు మంచి వ్యాయామం.

* జీర్ణక్రియ, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

* ఒత్తిడిని తగ్గించి మనసును ఉల్లాస పరుస్తుంది.


Next Story

Most Viewed