Weight Gain Tips: సన్నగా ఉన్న వారు .. వీటిని ఫాలో అయితే లావు అవ్వొచ్చు!

by Prasanna |
Weight Gain Tips: సన్నగా ఉన్న వారు .. వీటిని ఫాలో  అయితే  లావు అవ్వొచ్చు!
X

దిశ, వెబ్ డెస్క్ : బరువు తగ్గడానికి ఎంత కష్ట పడతారో ? బరువును పెంచుకోవడానికి కూడా అంతే కష్ట పడాల్సి ఉంటుంది. అనారోగ్య సమస్యల వల్ల కొందరు బరువు తగ్గిపోతారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన బరువు పెరగరు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారికీ ఆరోగ్య నిపుణులు చెప్పిన సలహా ఏంటంటే.. యోగాసనాలు వేయడం వల్ల ఈజీగా బరువు పెరుగుతారట.అవేంటో ఇక్కడ చూద్దాం..

వజ్రాసనం

ఆహారం తీసుకున్న తర్వాత వజ్రాసనం వేయడం వల్ల జీర్ణవ్యవస్థకు మంచిదట. ఇలా వేయడం వల్ల తిన్నది వెంటనే అరిగిపోయి మళ్లీ ఆకలి వేస్తుందట.. దీని వల్ల ఆహారం ఎక్కువ సార్లు తీసుకోవచ్చు. క్రమంగా శరీర బరువు కూడా పెరుగుతుంది.

పవన్ముక్తాసనం

శరీర బరువును పెంచేందుకు పవన్ముక్తాసనం బాగా ఉపయోగపడుతుందని వైద్యులు వెల్లడించారు.ఈ ఆసనం ప్రతిరోజు వేయడం వల్ల ఆకలి బాగా వేస్తుందట. ఆకలి వేసినప్పుడు తినే ఆహారాన్ని పెంచుకుంటూ ఉండండి. అలా కొన్ని రోజులకీ శరీర ఆకృతి కూడా క్రమంగా మారుతూ ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

వరండాలో కూర్చొని స్మోక్ చేస్తే .. పిల్లల ఆరోగ్యంపై ప్రభావం పడే ప్రమాదం ఉందా?

Next Story

Most Viewed