నదులు, సముద్రాల్లో ప్లాస్టిక్ ఏరివేసే రోబో

by Disha Web Desk 7 |
నదులు, సముద్రాల్లో ప్లాస్టిక్ ఏరివేసే రోబో
X

దిశ, ఫీచర్స్: ప్లాస్టిక్ సమస్య ప్రపంచాన్ని వేధిస్తోంది. 2000 సంవత్సరం నుంచి ఇప్పటికీ ప్లాస్టిక్ వేస్ట్ దాదాపు రెట్టింపు అయింది. నేలను మాత్రమే కాదు నీటిని కలుషితం చేసింది. పశుపక్ష్యాదులను కాటువేస్తోంది. ఈ క్రమంలో నదులు, సముద్రాలను శుభ్రపరచడం అనివార్యం కాగా ఇందుకోసం తొలి మెరైన్ రోబో వేస్ట్‌షార్క్(WasteShark)ను డెవలప్ చేశాడు రిచర్డ్ హర్డిమాన్. షార్క్ విశాలమైన నోటి నుంచి ప్రేరణ పొంది అభివృద్ధి చేసిన ఈ రోబోటిక్ షార్క్‌ను.. తాజాగా లండన్‌లోని థేమ్స్‌ నదిలో వదిలారు. వ్యర్థాలను తీయడంలో నిమగ్నమైన ఈ రోబో.. ప్రతిరోజూ 1100lbs వ్యర్థాలను తినే సామర్థ్యం కలిగి ఉన్నట్లు తెలిపారు. ఇది 22,700 ప్లాస్టిక్ బాటిళ్లకు సమానం.

ఇక ఒక్కసారి రీచార్జ్ చేస్తే దాదాపు 5కిమీ వరకు నీటిలో ప్రయాణించగలిగే ఈ మెరైన్ రోబో.. ఇలా సేకరించిన చెత్తను సాధ్యమైన చోట రీసైక్లింగ్ చేయడం ద్వారా ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఎదుర్కోగలమని అంటున్నారు నిపుణులు. అంతేకాదు నీటిలో ప్లాస్టిక్‌ను సేకరించే రోబో.. అదే సమయంలో వాటర్ క్వాలిటీని కూడా అంచనావేస్తుందని తెలిపారు డెవలపర్స్. ఇక సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, యూఏఈలో సైతం వేస్ట్‌షార్క్ సక్సెస్‌ఫుల్‌గా లాంచ్ చేశామని తెలిపిన వారు.. ప్రపంచవ్యాప్తంగా మిలియన్స్ ఆఫ్ వేస్ట్‌షార్క్‌లను అందించడమే తమ లక్ష్యమని వివరించారు.


Next Story

Most Viewed