కళ్లు చెదిరేలా.. 'ఫ్లాట్ ఫిష్'

by Disha Web Desk 7 |
కళ్లు చెదిరేలా.. ఫ్లాట్ ఫిష్
X

దిశ, ఫీచర్స్: సముద్రపు లోతుల్లో నివసించే రకరకాల జంతు జాతులు ఒక్కోసారి తీరానికి చేరుకుని ప్రజలను విస్మయానికి గురిచేస్తుంటాయి. ఇటువంటి రహస్య జీవులను కనుగొనేందుకు శ్రమిస్తున్న శాస్త్రవేత్తలు కూడా ఒక్కోసారి వాటి ఆకృతి చూసి ఆశ్చర్యపోతుంటారు. తాజాగా అలాంటి విచిత్ర ఆకారంతో ఉన్న చేపను పరిశోధకులు గుర్తించారు.

మ్యూజియమ్స్ విక్టోరియా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన శాస్త్రవేత్తలు.. గబ్బిలాల మాదిరి కళ్లు లేకుండా అండాశయాలు, వృషణాలు రెండింటినీ కలిగిన ఎత్తైన రెక్క బల్లి చేపలను కనుగొన్నారు. 'ఫ్లాట్ ఫిష్‌'గా పిలువబడే ఈ విచిత్రమైన చేప తలపై మనిషిని పోలిన కళ్లు, చర్మం చుట్టూ రకరకాల మచ్చలను కలిగి అందరినీ ఆశ్చర్యపరచింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. కాగా ఈ జీవులు 290,213 చదరపు మైళ్లు (467,054 చదరపు కిలోమీటర్లు) విస్తీర్ణంలో ఉన్న ఆస్ట్రేలియాలోని రిమోట్ కోకోస్ ఐలాండ్స్ మెరైన్ పార్క్‌ యాత్రలో కనుగొనబడ్డాయి. ఇది పశ్చిమ ఆస్ట్రేలియాలో ఉన్న పెర్త్, డిస్కవరీ సైట్‌కు వాయువ్యంగా 1,708 మైళ్లు (2,750 కిమీ) దూరంలో ఉంది.


Next Story