మాయాజాలమే.. ద్రవంగా మారి తప్పించుకుంటుంది.. పటిష్టంగా మారిపోతుంది..

by Disha Web Desk 17 |
మాయాజాలమే.. ద్రవంగా మారి తప్పించుకుంటుంది.. పటిష్టంగా మారిపోతుంది..
X

దిశ, ఫీచర్స్: ఇది సైన్స్ ఫిక్షన్ కాదు.. రియల్. కమాండ్ చేస్తే కరిగిపోయే, మరో కమాండ్‌తో పటిష్టంగా మారే చిట్టిరోబోను తయారుచేశారు. అచ్చం 'టెర్మినేటర్ 2' లోని రోబో మాదిరిగా వర్క్ చేసే ఈ రోబో.. క్లోజ్డ్ సర్ఫేస్ నుంచి సులభంగా తప్పించుకునేందుకు సహాయపడగలదు. మెడికల్ అండ్ టెక్నాలాజికల్ అప్లికేషన్స్‌లో గొప్ప సహాయసహకారాలను అందించగలదు. మాగ్నెటిక్ నియోడైమియం, బోరాన్, ఇనుము సూక్ష్మ భాగాలను గాలియం లిక్విడ్(తక్కువ ద్రవీభవన స్థానం కలిగిన లోహం)లో పొందుపరచడం, అలా వదిలేయడం ద్వారా దీన్ని పటిష్టంగా మార్చగలిగారు.


'ద్రవ మరియు ఘన స్థితుల మధ్య మారే సామర్థ్యాన్ని రోబోలకు ఇవ్వడం వల్ల వాటికి మరింత కార్యాచరణ లభిస్తుంది' అని అధ్యయన ప్రధాన రచయిత చెంగ్‌ఫెంగ్ పాన్ తెలిపారు. రోబోను లిక్విడ్‌గా మారమని కమాండ్ ఇచ్చేందుకు మాగ్నెట్స్‌ను ఉపయోగించిన శాస్త్రవేత్తలు.. 'పంజరంలోని కడ్డీల గుండా జారిపోవడం, తప్పించుకోవడం.. అదే పంజరం అవతలి వైపున తనను తాను పునర్ నిర్మించుకోవడం' రికార్డు చేశారు.

ఈ ప్రయోగం కోసం, మాగ్నెటిక్ ఇండక్షన్ ప్రక్రియ ద్వారా రోబో వేడి చేయబడింది. దాని లోపల విద్యుత్ ప్రవాహాన్ని అమర్చడానికి మూవింగ్ మ్యాగ్నెటిక్ ఉపయోగించబడింది. కరెంట్ గాలియంను కరిగిస్తుంది. దానిలోని అయస్కాంత మూలకాలు అయస్కాంతం వైపు ఆకర్షించబడతాయి. ఇక్కడ ఉన్న అయస్కాంత కణాలకు రెండు రోల్స్ ఉన్నాయి. ఒకటి.. పదార్థాన్ని ప్రత్యామ్నాయ అయస్కాంత క్షేత్రానికి ప్రతిస్పందించేలా చేస్తాయి. కాబట్టి మీరు ఇండక్షన్ ద్వారా పదార్థాన్ని వేడి చేయవచ్చు, దశ మార్పుకు కారణం కావచ్చు. మరొకటి రోబోలకు కదిలే సామర్థ్యాన్ని అందించగలవు' అని పరిశోధకులు నిర్ధారించారు.

Next Story

Most Viewed