ఆల్ బుఖార పండ్ల వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!

by Disha Web Desk 10 |
ఆల్ బుఖార పండ్ల వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!
X

దిశ, ఫీచర్స్: ఆల్ బుఖారా ఒక రుచికరమైన, పోషకమైన పండు. దీన్ని తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఎరుపు, నీలం రంగును కలిగి ఉంటుంది. వర్షాకాలంలోనే ఈ పండ్లు మనకు లభిస్తాయి. ఇవి తియ్యగా ఉంటాయి.

ఈ ఆల్ బుఖారాలో ఎన్నో రకాల పోషకాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా పొటాషియం పుష్కలంగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. అధిక యాంటీఆక్సిడెంట్ కంటెంట్ శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంది. తక్కువ కేలరీల కంటెంట్ కారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ పండ్లతో మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏంటో ఇక్కడ చూద్దాం..

1. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

* అన్ని బుఖారా పండ్లలో ఉండే సార్బిటాల్ మలబద్ధకాన్ని నివారిస్తుంది.

* ఇసాటిన్ జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా సహాయపడుతుంది.

2. క్యాన్సర్ నివారణ

* అన్ని బుఖారా పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలతో పోరాడుతాయి.

* మహిళల్లో రొమ్ము క్యాన్సర్, శ్వాసకోశ క్యాన్సర్‌ను నివారిస్తుంది.


Next Story

Most Viewed