వేసవిలో చర్మ సమస్యలు బాధిస్తున్నాయా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..

by Disha Web Desk 20 |
వేసవిలో చర్మ సమస్యలు బాధిస్తున్నాయా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
X

దిశ, ఫీచర్స్ : వేసవి కాలం వచ్చిందంటే చాలు చెమట, ఉక్కపోత, చికాకు. అంతే కాదు చర్మ సమస్యలు కూడా తలెత్తుతాయి. వేసవికాలంలో సూర్యరశ్మిలోని UV కిరణాల కారణంగా చర్మం పొడిబారడమే కాకుండా అనేక విధాలుగా హాని కలిగిస్తాయని చర్మ నిపుణులు అంటున్నారు. వేసవి కాలంలో బయటకు వెళ్లాల్సి వస్తే చర్మాన్ని కప్పి ఉంచుకోవాల్సి వస్తుంది. అందుకే ఎల్లప్పుడూ సన్‌స్క్రీన్‌ను మీతో ఉంచుకోవాలని చెబుతున్నారు నిపుణులు. దీన్ని ఉపయోగించడం వల్ల చర్మం పొడిబారదని చెబుతున్నారు.

అలాగే ఈ సీజన్‌లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మం పై దద్దుర్లు, దురదలు, మొటిమలు వంటి సమస్యలు కూడా రావచ్చు. అయితే ఎండాకాలంలోనే చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఎందుకు కనిపిస్తాయి, దీనికి గల కారణాలు ఏంటి, ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చర్మ సమస్యలకు కారణాలు..

నిపుణుల అభిప్రాయం ప్రకారం వేసవిలో చర్మ సమస్యలకు కారణం సూర్యుని UV కిరణాలు అని చెబుతున్నారు. వేసవి కాలంలో మధ్యాహ్నం ఎక్కువ సేపు బయట ఉండవలసి వస్తే, అప్పుడు చర్మం పై వేడి పడి దద్దుర్లు సంభవిస్తాయట. చర్మం సున్నితంగా ఉన్నవారికి లేదా అలెర్జీ సమస్యలతో బాధపడేవారికి ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది.

వేడి కారణంగా చర్మం పై దురద పెరుగుతుంది. చర్మశోథ, తామర వంటి సమస్యలు ఉంటే ఈ సీజన్‌లో అవి మరింతగా ప్రేరేపించబడవచ్చు. ఇది దురద, దద్దుర్లు కలిగించవచ్చు.

ఎలాంటి జాగ్రత్తలు వహించాలి..

అలోవెరా జెల్ : ఆయుర్వేదంలో కలబందకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది అనేక సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా వేసవిలో చర్మ సంరక్షణకు కలబంద ఉపయోగకరంగా ఉంటుంది. చర్మంలో దురద, మచ్చలు, మంటలను తొలగించడంలో ఇది ఉపయోగపడుతుంది. దీని జెల్‌ను చర్మం పై అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.

కొబ్బరి నూనె : టీ ట్రీ ఆయిల్‌లో కొన్ని చుక్కల కొబ్బరి నూనెను మిక్స్ చేసి అప్లై చేయడం వల్ల చర్మ సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు. దీన్ని మీ చర్మం ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసి వదిలేయండి. కొంత సమయం తర్వాత స్నానం చేయాలి.

మెంతి గింజలు : మీరు ఏదైనా చర్మ సమస్య కారణంగా అలెర్జీ లక్షణాలను ఎదుర్కొంటుంటే మెంతి గింజలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ గింజలను నీటిలో వేసి మరిగించి ఆ తర్వాత ఆ నీటితో స్నానం చేయాలని చెబుతున్నారు నిపుణులు.



Next Story

Most Viewed