పౌర్ణమి సమయంలో ఆత్మహత్యల పెరుగుదల.. కారణమిదే..!!

by Prasanna |
పౌర్ణమి సమయంలో ఆత్మహత్యల పెరుగుదల.. కారణమిదే..!!
X

దిశ, ఫీచర్స్: ఇండియానా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అధ్యయనం ప్రకారం పౌర్ణమి సమయంలో ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఎక్కువగా ఉంది. మారియన్ కౌంటీ కరోనర్ కార్యాలయంలో సేకరించిన సూసైడ్ డేటా ఆధారంగా ఈ విశ్లేషణను నిర్వహించిన సైంటిస్టులు.. ఫుల్ మూన్ వీక్‌లో సూసైడ్ రేట్ అసాధారణంగా ఎక్కువగా ఉందని వెల్లడించారు. ఇండియానాలో వేసవి ఎండ తీవ్రత అప్పుడప్పుడే తగ్గుతూ టెంపరేచర్స్ పడిపోతుంటాయని, సెప్టెంబరు నెలలో దాదాపు 10°F ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయన్నారు. ఈ మంథ్‌లోనే మధ్యాహ్నం 3-4 గంటల మధ్య ఆత్మహత్య చేసుకునే అవకాశాలు సాధారణంగా అధికమని కనుగొన్నారు.

పరిశోధకులు ఇక్కడ మానవ అంతర్గత జీవ గడియారాన్ని పరిగణలోకి తీసుకున్నారు. సిర్కాడియన్ రిథమ్‌ పరిసర కాంతికి అనుసంధానించబడి ఉందని, ఈ సమయంలో మానవులు రాత్రి నిద్రించడానికి ఇష్టపడట్లేదని చెప్పారు. ఫుల్‌మూన్ వీక్‌లో ఉత్పత్తి చేయబడిన అదనపు కాంతి శరీరంపై అదనపు ఒత్తిడిని సృష్టిస్తుంది. అందుకే ఈ నిర్దిష్ట సమయాల్లో ఆత్మహత్య చేసుకునే అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా 55 ఏళ్లు పైబడిన వారు ఎక్కువగా ప్రభావితమవుతారని, నిరాశ లేదా మద్యపాన రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులలో ఈ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు శాస్త్రవేత్తలు.

Advertisement

Next Story