షాకింగ్ : యువతను టార్గెట్ చేస్తున్న స్ట్రోక్.. మూడు నిమిషాలకు ఒకరు డెడ్ !

by Disha Web Desk 8 |
షాకింగ్ : యువతను టార్గెట్ చేస్తున్న స్ట్రోక్.. మూడు నిమిషాలకు ఒకరు డెడ్ !
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం చాలా మంది భయపడుతున్నారంటే అది స్ట్రోక్‌ అనే పదానికే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో దీని వలన చాలా మంది తమ ప్రాణాలు కోల్పోయారంట. అయితే తాజాగా చేసిన ఓ సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడి అయ్యాయి. ఈ ఏడాదిలో 795 వేల మందికి పైగా స్ట్రోక్​ గురైనట్లు తాజా అధ్యయనం తెలిపింది. ఇందులో ఎక్కువగా స్త్రీలు ఉన్నట్లు సమాచారం. ప్రతి 40 సెకన్లకు ఒక స్ట్రోక్ కేసు నమోదు అవుతున్నట్లు సర్వేలో తేలింది.

అయితే మనం తీసుకుంటున్న ఆహారం, జీవనశైలి కారణంగా ఈ వ్యాధి బారినపడుతున్నారంట. అందువలన ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని, కళ్లు తిరగడం, అధిక బీపీ, శరీరంలో ఒకవైపు బలహీనతగా మారడం, మూర్ఛ పోవడం, స్పందన లేకపోవడం,, వాంతులు, వికారం, ఎక్కిళ్ల వంటి లక్షణాలు కనిపిస్తే అస్సలే నెగ్లెట్ చేయకుండా వైద్యుడిని సంప్రదించాలని వారు చెబుతున్నారు.

ఇక ఈ స్ట్రోక్‌లలో కూడా రకాలు ఉంటాయి. మెదడులో రక్తస్రావం కావడాన్ని హెమరేజి స్ట్రోక్ అంటారు. ఇది బ్రెయిన్ ట్యూమర్ కిందికి కూడా వస్తుంది.మెదడులో రక్తం గడ్డకట్టడం, లేదా ధమనిని అడ్డుకుంటే దానిని ఇస్కీమిక్ స్ట్రోక్ అంటారు. అయితే ఈ స్ట్రోక్ వచ్చినప్పుడు వెంటనే గుర్తించి వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లాలంట. ముఖ్యంగా స్ట్రోక్ లక్షణాలు గుర్తించిన మూడు గంటలలోపు ఆస్పత్రికి తీసుకెళ్తే చికిత్స త్వరగా అందించి, ఆరోగ్యం కుదుటపడేలా చేసే వీలు ఉంటుంది.

సమస్యకు పరిష్కారాలు

ఇప్పుడు చాలా మందిని భయపడుతున్న వ్యాధి స్ట్రోక్, కాబట్టి ఈ సమస్య రాకుండా ఉండాలంటే మెదడు శక్తికోసం పిండిపదార్థాలు, దాని పనితీరు కోసం కొలెస్ట్రాల్ తీసుకోవాలి. రెగ్యూలర్ వ్యాయామం, సమతుల్య ఆహారం, కూరగాయలు, బి12 , యాంటీఆక్సిడెంట్స్ ఉన్నఫుడ్ తీసుకోవడం, అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం వలన ఈ వ్యాధికి దూరంగా ఉండొచ్చు అంటున్నారు వైద్యులు.


Next Story

Most Viewed