Gall Bladder Stones: గాల్ బ్లాడర్ స్టోన్స్‌‌తో బాధపడుతున్నారా.. తక్షణమే ఈ జాగ్రత్తలు తీసుకోండి

by Disha Web Desk 10 |
Gall Bladder Stones: గాల్ బ్లాడర్ స్టోన్స్‌‌తో బాధపడుతున్నారా..  తక్షణమే ఈ జాగ్రత్తలు తీసుకోండి
X

దిశ, ఫీచర్స్: వినడానికి సింపుల్‌గానే అనిపించినా గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది అనుభవించేవారికి తీవ్రమైన బాధను కలిగిస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో ఇది ఎంతో ముఖ్యమైనది. తిన్న ఆహారం జీర్ణం అయ్యేందుకు అవసరమైన పైత్య రసాలను రిలీజ్ చేస్తుంది. ఇది కాలేయం కింది భాగంలో ఉండే చిన్న అవయవమని, గాల్ బ్లాడర్ లేదా పిత్తాశయం అని పిలుస్తారని వైద్యులు చెప్తున్నారు. ఇది పైత్య రసాన్ని స్టోర్ చేసుకుని అవసరం మేరకు అందిస్తూ చిన్న ప్రేగులలో ఆహారాన్ని జీర్ణం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే జీవన శైలి మార్పుల కారణంగా ఇది ప్రభావితం అవుతూ ఉంటుంది. ఈ మధ్య మన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా చాలామంది గాల్ బ్లాడర్ స్టోన్స్ సమస్యతో బాధపడుతుండటం క్రమంగా పెరుగుతోందని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. శరీరంలో తలెత్తే ఇబ్బంది, లక్షణాలను బట్టి డాక్టర్‌ను సంప్రదించినప్పుడు అవసరమైన టెస్టుల ద్వారా గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్న సంగతి బయట పడుతుంది.

తినకూడని పదార్థాలు

గాల్ బ్లాడర్ స్టోన్స్ సమస్య ఉన్నవారు మిల్క్ ప్రొడక్ట్స్‌కు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. పాలతో తయారు చేసే వివిధ ఉత్పత్తులు, స్వీట్లు ఆరోగ్యానికి మంచివిగా చెప్తుంటారు. కానీ గాల్ బ్లాడర్ (పిత్తాశయం)లో స్టోన్స్ ఉన్నవారికి మాత్రం ఆ సమస్య తగ్గేవరకు వీటికి దూరంగా ఉండాలి. జున్ను, వెన్న, హెవీ ఐస్ కలిగిన పదార్థాలను తీసుకోవద్దు. అలాగే వేపుడు పదార్థాలను తీసుకోవద్దు. ముఖ్యంగా పొటాటో చిప్స్ వంటివి మినహాయించాలి. ఎందుకంటే ఇవి పిత్తాశయంలో రాళ్లవల్ల కలిగే నొప్పిని అధికం చేస్తాయి.

ప్యాకేజ్డ్ ఫుడ్, రెడ్ మీట్

ఇటీవల చాలామంది ప్యాకేజ్డ్ ఫుడ్స్ తీసుకుంటున్నారు. ఇందులో ఉండే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ గాల్ బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని మరింత పెంచుతాయని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి వీటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే రెడ్ మీట్‌‌లో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటంతోపాటు కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది కాబట్టి గాల్ బ్లాడర్ స్టోన్స్‌తో ఇబ్బందిపడేవారు దీనిని తినకూడదని వైద్యులు చెప్తున్నారు. వాస్తవంగా తరచూ తీసుకునే ఆహారంలో ఫైబర్‌ కంటెంట్ తగ్గడం మూలంగా గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఏర్పడుతుంటాయి. అందుకే ప్రాసెస్ చేయబడిన ఫైబర్ రహిత ఆహార పదార్థాలు మితిమీరి తీసుకోకూడదు. ట్రీట్‌మెంట్ తీసుకున్నాక డాక్టర్ సూచన మేరకు దాదాపు అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవచ్చు.



Next Story

Most Viewed