మూత్రం నిలబడి పోయాలా? కూర్చోని పోయాలా?... ఎలా పోస్తే మంచిది?

by Dishanational1 |
మూత్రం నిలబడి పోయాలా? కూర్చోని పోయాలా?... ఎలా పోస్తే మంచిది?
X

దిశ, వెబ్ డెస్క్: మూత్ర విసర్జనను ఎలా చేయాలి? కూర్చొని చేయాలా లేక నిలబడి చేయాలా? అనే డౌట్ కొద్దిమందిలో ఉంటుంది. మన ఇండియాలో అంతగా ఈ డౌట్ ఉండకపోవొచ్చు గానీ, యూరోపియన్ దేశాల్లో నిలబడి మూత్ర విసర్జన చేయడంపై నిషేధం విధించారు. అంతేకాదు... పలు దేశాల్లో అయితే, మూత్ర విసర్జన విషయంలో పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. దీనిని కొందరు సమాన హక్కుల అంశంగా చూస్తుంటారు. ఇందుకు సంబంధించి ముందుకు వెళ్తే...

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా దేశాల్లో మూత్రం విసర్జించే సమయంలో సంప్రదాయాన్ని లేదా పలు పద్ధతులను పాటిస్తుంటారు. చాలా ఎక్కువగా పురుషులు నిలబడే మూత్ర విసర్జన చేస్తుంటారు. అయితే, ఈ విధానాన్ని పలు దేశాలకు చెందిన వైద్య నిపుణులు ఆ విధానాన్ని తప్పు బడుతూ పలు సూచనలు చేస్తున్నారు. ఆరోగ్యం, పరిశుభ్రతను దృష్టిలో పెట్టుకుని ఈ అలవాటును పురుషులు మానుకోవాలని చెబుతున్నారు.

మూత్రపిండాలు రక్తాన్ని నిరంతరం శుద్ధి చేస్తుంటాయి. రక్తాన్ని ఒడపోత ప్రక్రియలో విడుదలయ్యే వ్యర్థ పదార్థమే మూత్రం. ఆ వ్యర్థ పదార్థం మూత్ర ఆశయంలో నిల్వ ఉంటుంది. మనుషుల మూత్రాశయ సామర్థ్యం 300 మిల్లీ లీటర్ల నుంచి 600 మిల్లీ లీటర్ల వరకు ఉంటుంది. కానీ, చాలావరకు అది మూడింట రెండింట వంతులు నిండగా దానిని మనం విసర్జిస్తుంటాం. మూత్రాశయాన్ని పూర్తిగా ఖాళీ చేయాలంటే మనలో నాడుల నియంత్రణ వ్యవస్థ సరిగా పని చేయాలి. అప్పుడే టాయిలెట్ కు ఎప్పుడు వెళ్లాలో మనకు తెలుస్తుంది. మనకు మూత్రం వచ్చిన సమయంలో ఒకవేళ టాయిలెట్స్ దగ్గరలో లేనప్పుడు మూత్రాన్ని అలాగే ఆపుకునేందుకు మనకు వీలుంటుంది. మూత్రాశయం నిండినప్పుడు ఆ విషయం నాడుల ద్వారా మెదడుకు చేరుతుంది. అప్పుడు మనకు టాయిలెట్ కు వెళ్లాలనిపిస్తుంది. మనం మూత్రం విసర్జించేందుకు టాయిలెట్ కు వెళ్లగానే మూత్రాశయం ఖండరాలు ముడుచుకుంటాయి. అప్పుడు అందులోని మూత్రం విసర్జన నాళం ద్వారా బయటకు వస్తుంది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి మూత్ర విసర్జన సులువుగానే జరుగుతుంది. అయితే, పలువురు పురుషులకు మూత్ర విసర్జనలో తాత్కాలికంగా, శాశ్వతంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రోస్టెడ్ గ్రంధీతో బాధపడుతున్నవారు మూత్ర విసర్జన సమయంలో ఇబ్బంది పడుతుంటారు. అలాంటివారు కూర్చోని మూత్ర విసర్జన చేస్తే ఉపశమనం లభిస్తుందని.. కూర్చోవడం వల్ల మూత్రవిసర్జన నాళంలోని మూత్ర ప్రవాహం సాఫీగా సాగుతుందని ఓ అధ్యయనంలో తేలింది.

అయితే, ఆరోగ్యవంతంగా ఉండే పరుషులు కూర్చోని లేదా నిల్చొని మూత్ర విసర్జన చేసినా ఎలాంటి అసౌకర్యానికి గురవుతలేరని, మూత్ర విసర్జన సమస్యలున్న పురుషులు నిల్చొని మూత్ర విసర్జన చేయడం వల్ల ఇబ్బంది పడుతున్నారని, కూర్చొని మూత్ర విసర్జన చేయడం వల్లవారు ఎలాంటి ఇబ్బంది పడడం లేదని, ప్రశాంతంగా ఫీలవుతున్నారని, అయితే, వాళ్లు కూర్చొని మూత్ర విసర్జన చేస్తేనే బెటర్ అని యూకేకు చెందిన పలువురు వైద్య నిపుణులు ఈ అంశంపై అధ్యయనం చేసి సూచనలు చేశారు. కూర్చొని మూత్ర విసర్జన చేయడం వల్ల మూత్ర విసర్జన సమస్యలు తగ్గుతాయని సలహా ఇస్తున్నారు.

Next Story