అక్కడ సీత రాములవారి కళ్యాణంతో పాటు హిజ్రాలకు పెళ్లి చేస్తారంట?

by Dishanational2 |
అక్కడ సీత రాములవారి కళ్యాణంతో పాటు  హిజ్రాలకు పెళ్లి చేస్తారంట?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వెములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీరాములోరి కళ్యాణం వైభవంగా జరుగుతుంది. అయితే ఇక్కడ సీతారాముల కళ్యాణానికి ఓ ప్రత్యేకత ఉంది. అది ఏమిటంటే?

చైత్రశుద్ద నవమి పునర్వసు నక్షత్ర యుక్తమైన అభిజిత్ లగ్నంలో శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని అనుజానంగా నిర్వహిస్తుంటారు. అయితే శ్రీరామనవమి వైష్ణవాలయాల్లోనే కాదు అనేక శివాలయాల్లో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. శివ కేశవుల మద్య అభిదాన్ని పాటిస్తూ ఆ రామనారాయణుడికి ఉత్సవాలను జరపడం ఇక్కడ విశేషం.

అయితే వెముల వాడలో ఓ వైపు సీతారాముల కళ్యాణం జరుగుతుంటే, మరోవైపు జోగినీలు, శివుడిని తమ నాథుడిగా భావించి వివాహం చేసుకుంటారు. ఉదయాన్నే రాజన్న ఆలయంలోని గుండంలో స్నానాలు ఆచరించి, తర్వాత శివయ్యను దర్శించుకొని, రాములోరి కళ్యాణం జరిగే స్థలానికి వెళ్తారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన జోగినిలు అందంగా ముస్తాబై పెళ్లి పీటలు ఎక్కుతారు. పట్టు వస్త్ర్రాలను ధరించి, పసుపు, కుంకుమలతో అందంగా అలంకరించుకొని సీతా రాముల కళ్యాణం జరిగే సన్నిధికి చేరుకుంటారు. రామల వారు సీతమ్మకు తాళి కట్టే సమయంలోనే శివుడు తమను వివాహం చేసుకున్నట్లు భావించి ఒకరి పై ఒకరు తలంబ్రాలు పోసుకుంటూ వివాహం అయినట్లు భావిస్తారు. అలా నవమిరోజు జోగినీలు శివయ్యను పరిణయం ఆడుతారు.

ఇవి కూడా చదవండి: నకిలీ తేనెటీగలను సృష్టిస్తున్న పుష్పాలు.. కారణం తెలిసి సైంటిస్టులు షాక్

Next Story

Most Viewed