మీరు చికెన్ తినాలో? మటన్ తినాలో.. మీ బ్లడ్ గ్రూపు నిర్ణయిస్తుందట?

by Disha Web Desk 10 |
మీరు చికెన్ తినాలో? మటన్ తినాలో.. మీ బ్లడ్ గ్రూపు నిర్ణయిస్తుందట?
X

దిశ, ఫీచర్స్: ఆదివారం వస్తే.. కొంతమందికి ముక్కలేనిదే ముద్ద దిగదు. చికెన్ ను చాలా మంది ఇష్టంగా తింటారు. చికెన్ తో ఒక కర్రీ మాత్రమే కాకుండా.. వెరైటీలు చేసుకుని తినేస్తుంటారు. కానీ అదే పనిగా చికెన్ ను తినకూడదని చెబుతున్నారు. అయితే చికెన్ కానీ, మటన్ కానీ మనం ఏం తినాలో నిర్ణయించేది మన మైండ్ కాదట. మన బ్లడ్ గ్రూప్ చెబుతుందట.. ఇది మీకు వినడానికి ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు. ప్రతిఒక్కరూ వారి బ్లడ్ గ్రూప్ ను బట్టి ఎలాంటి ఆహారం తినాలో తెలుసుకోవచ్చట. ఏ బ్లడ్ గ్రూప్ వారు ఏ ఫుడ్ తీసుకోవాలో ఇక్కడ చూద్దాం.

ఏ బ్లడ్ గ్రూపు

ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. వారికి రోగనిరోధక శక్తి కూడా తక్కువగా ఉంటుంది. జీర్ణక్రియ కార్యకలాపాలు తక్కువగా ఉంటాయి. అందువల్ల, వారు తినే ఆహారంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. అలాంటివారు మంచి ఆహారం తీసుకోవాలి. చికెన్, మటన్ తక్కువగా తినండి. మాంసాన్ని జీర్ణం చేయడంలో వారికి ఇబ్బంది ఉంటుంది. వీరికి చేపలు సులభంగా జీర్ణమవుతాయి.

బి బ్లడ్ గ్రూప్

ఈ బ్లడ్ గ్రూపు వారు చాలా శక్తివంతంగా ఉంటారు. వీరికి రోగనిరోధక శక్తి కూడా ఎక్కువ. మీరు తినే ఆహారంతో సంబంధం లేకుండా చికెన్ , మటన్ సులభంగా జీర్ణం అవుతుంది. అందుకే ఆహారంలో కూరగాయలతో పాటు నాన్ వెజిటబుల్ వెజిటేబుల్స్ తీసుకోవడం మంచిది. అయితే పచ్చి కూరగాయలతో పాటు పండ్లు, చేపలు తినడం చాలా ముఖ్యం.

ఏబి , ఓ బ్లడ్ గ్రూప్స్

ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు సమతుల్య ఆహారం తీసుకోవాలి. ప్రత్యేక ఆంక్షలు ఉండవు. అయితే చికెన్, మటన్ తినేటప్పుడు మీరు అలోచించి తినండి. కూరగాయలు, సీఫుడ్ తినవచ్చు. కానీ కొందరికి జీర్ణ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా తింటే పొట్ట సమస్యలు వస్తాయి. జీర్ణం కావడానికి సమయం పడుతుంది. అలాంటి వారు వైద్యుడిని సంప్రదించాలి.

Next Story

Most Viewed