ఇంటర్నల్ బ్లీడింగ్‌ను అరికట్టవచ్చు.. కంపోనెంట్ మెటీరియల్స్‌ను రూపొందించిన సైంటిస్టులు

by Disha Web Desk 9 |
ఇంటర్నల్ బ్లీడింగ్‌ను అరికట్టవచ్చు.. కంపోనెంట్ మెటీరియల్స్‌ను రూపొందించిన సైంటిస్టులు
X

దిశ, ఫీచర్స్: ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడినప్పుడు అధికంగా రక్తస్రావం జరుగుతుంది. కొన్నిసార్లు అవయవాల్లోనూ అలా జరుగవచ్చు. ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల ప్రాణహాని సంభవించే అవకాశం ఉంటుంది. మానవ శరీరం సహజంగానే ఎక్కువగా రక్తం కారకుండా గడ్డగట్టే స్వభావాన్ని కలిగి ఉన్నప్పటికీ, కొందరిలో ఇటువంటి పరిస్థితి అరుదుగా ఉండవచ్చు. లేదా గాయాల తీవ్రతను బట్టి రక్త స్రావం ఆగకపోవచ్చు. అటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఇంటర్నల్ బ్లీడింగ్‌తో పాటు, శరీరం వెలుపల తగిలిన గాయాలవల్ల రక్తం ఎక్కువగా బయటకు పోవడాన్ని ఆపగలిగితే ప్రాణాలు దక్కే అవకాశం ఉంటుంది.

అందుకే యూఎస్‌కు చెందిన సైంటిస్టులు శరీంలోకి ఇంజెక్ట్ చేయగల రెండు కంపోనెంట్ మెటీరియల్స్‌ను (పదార్థాలను) రూపొందించారు. ఇవి రక్త స్రావాన్ని వెంటనే అరికడతాయి. వీటిని బాడీలోకి ఇంజెక్ట్ చేసే విధానాన్ని నానోపార్టికల్స్‌ అని పేర్కొంటారు. గతంలో హెమోస్టాటిక్ నానో పార్టికల్స్‌గా విధానం కూడా ఉంది. కానీ నానోపార్టికల్స్ విధానం అంతకంటే సమర్థవంతమైందని పరిశోధకులు చెప్తున్నారు. ఈ కొత్త పద్ధతి బ్లీడింగ్‌ను ఆపడానికి సహాయపడే ఫైబ్రినోజెన్ ప్రోటీన్‌ను ప్రేరేపిస్తుందని, తద్వారా రక్త్రసావం జరగకుండా ఆగిపోతుందని మసాచుట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ పౌలా హమ్మండ్ తెలిపారు.

Also Read..

డెస్క్ టాప్‌లో మీ వాట్సాప్ సరిగా పని చేయడం లేదా.. ఈ టిప్స్ మీకోసమే?



Next Story

Most Viewed