ఉదయాన్నే ఖాళీకడుపుతో గ్రీన్ టీ తాగుతున్నారా.. ?

by Disha Web Desk 8 |
ఉదయాన్నే ఖాళీకడుపుతో గ్రీన్ టీ తాగుతున్నారా.. ?
X

దిశ, ఫీచర్స్ : ఉదయం లేచిందంటే చాలు ప్రతీ ఒక్కరూ టీ తాగడానికి ఎక్కు వ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మరీ ముఖ్యంగా చాలా మంది మార్నింగ్ ఖాళీ కడుపుతోనే టీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ తాగడం లాంటిది చేస్తుంటారు. అయితే కొంత మంది మాత్రం ఎమ్టీస్టమక్‌తో గ్రీన్ టీ తాగితే బరువు తగ్గుతాం అని భావించి, ఉదయాన్నే గ్రీన్ టీ తాగుతారు.

అయితే అలా ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదంట. ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం చాలా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. ఉదయాన్న గ్రీ టీ తాగడం వలన డీ హైడ్రేషన్ భారినపడే అవకాశం ఎక్కువ ఉంటుందంట. అలాగే శరీరం నుంచి టాక్సిక్‌ పదార్థాలను క్లిన్‌ చేస్తుందన్న భావనతో కొంతమంది ఉదయాన్నే గ్రీన్‌ టీ తాగతారు. గంటల తరబడి కడుపు ఖాళీగా ఉన్న తర్వత, మీ జీవక్రియకు ఓదార్పుగా ఉండే పానీయాలు తీసుకోవడం మంచిది. గ్రీన్ టీలో బలమైన యాంటీఆక్సిడెంట్లు, బలమైన పాలీఫెనాల్స్ ఉంటాయి, ఇవి కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతాయి. జీవక్రియకు ఆటంకం కలిగిస్తాయి. అందువలన మార్నింగ్ ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తీసుకోకూడదంట. ఉదయం ఏదైనా తిన్న రెండు గంటల తర్వాత గ్రీన్‌ టీ తాగితే మంచి చేస్తుంది.

Next Story

Most Viewed