అక్కడికి వెళ్తే ప్రాణాలతో తిరిగి రావడం కష్టమే.. ఈ భయానక అడవి ప్రాంతం ఎక్కడుందో తెలుసా?

by Dishafeatures2 |
అక్కడికి వెళ్తే ప్రాణాలతో తిరిగి రావడం కష్టమే.. ఈ భయానక అడవి ప్రాంతం ఎక్కడుందో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచంలో వింతగొల్పే అందమైన పర్యాటక ప్రాంతాలే కాదు, భయానక రహస్య ప్రదేశాలు కూడా చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో జపాన్ దేశంలో ఒకీగహారా (Aokigahara) అడవి. ఇక్కడి హోన్షు ద్వీపంలోని ఫుజి పర్వతానికి వాయువ్య దిశలో ఉన్న ఈ అడవిని డెవిల్ ఫారెస్ట్ అని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ రాత్రింబవళ్లు వింతైన, భయంకరమైన ఏడుపు శబ్దాలు వినిపిస్తాయట. అటువైపు చుట్టు పక్కల ప్రదేశాలకు వెళ్లడానికి కూడా ప్రజలు భయపడుతుంటారని పర్యాటక నిపుణులు చెప్తున్నారు.

ఒకీగ్రహ ఫారెస్టు‌వైపు ఎవరైనా వెళ్తే తప్పకుండా మిస్ అవుతుంటారని,ప్రాణాలతో తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువ అని చెప్తుంటారు. అంతేకాకుండా ఇది సూసైడ్ స్పాట్‌గానూ ఉంటోంది. 35 నుంచి 40 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల ఈ అడవిలో చాలామంది ఆత్మ‌హత్య చేసుకున్నారని, వారంతా దెయ్యాలుగా మారి తిరుగుతుంటారని ఒక మూఢ నమ్మకం కూడా ప్రచారంలో ఉంది. అందుకే దెయ్యాల ఫారెస్ట్ అని స్థానిలు పేర్కొంటారు. అయితే ఈ అడవిలో భయంకరమైన ఏడుపు శబ్దాలు ఎందుకు వస్తాయి? అక్కడికి వెళ్లిన వారు ఎందుకని తప్పి పోతారు? కొందరు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు అనే విషయాలు ఇప్పటికీ వీడని మిస్టరీగానే ఉన్నాయని, ఛేదించేందుకు పరిశోధనలు జరుగుతున్నాయని నిపుణులు చెప్తున్నారు.



Next Story

Most Viewed