మిడ్‌నైట్ టెర్రర్ కేవ్.. వానదేవుడికి బలైన వేలమందితో ఎముకల గూడు

by Disha Web Desk 7 |
మిడ్‌నైట్ టెర్రర్ కేవ్.. వానదేవుడికి బలైన వేలమందితో ఎముకల గూడు
X

దిశ, ఫీచర్స్ : భూగ్రహంపైన కొన్ని ప్రదేశాలకు సంబంధించిన కథలు హర్రర్ సినిమాకు మించి ఉంటాయంటే అతిశయోక్తి కాదు. అలాంటి కథకు ప్రత్యక్ష ఉదాహరణ 'మిడ్‌నైట్ టెర్రర్ కేవ్'. 2006లో బెలిజ్‌లోని ఈ గుహ లోపల ఒక దోపిడీదారుడు అనుకోకుండా పడిపోవడంతో వెలుగులోకి వచ్చింది. అత్యంత భయానక స్థితికి జడుసుకుని తనను రక్షించాలంటూ అరిచిన అరుపులే స్థానికులను అర్ధరాత్రి వేళ ఆ గుహను తెరిచే పరిస్థితులు కల్పించాయి. అందుకే ఆ ప్రాంతానికి 'మిడ్‌నైట్‌ టెర్రర్‌ కేవ్‌' అనే పేరొచ్చింది.

ఈ గుహ మొత్తం వేల సంవత్సరాల కిందట బలిచ్చిన మానవుల ఎముకలతో పేరుకుపోయింది. ఇక పరిశోధకుల బృందం లోపలికి ప్రవేశించిన తర్వాత ఎముకల విశ్లేషణ, అధ్యయనం ద్వారా 118 మంది వ్యక్తులను గుర్తించింది. కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకుల ప్రకారం.. వారు పురాతన మయాన్ వరుణ దేవత 'చాక్' పేరు మీద బలిఇవ్వబడిన వ్యక్తులు కావచ్చు. వర్షం కురిపించడానికి చాక్ తన మెరుపు గొడ్డలితో మేఘాలను కొట్టాడని మయాన్లు విశ్వసించారు. అతను అజ్టెక్‌లలోని త్లాలోక్‌తో సంప్రదింపులు జరిపాడు.

దేవతలకు సంబంధించిన ఆచారాలలో, వర్షం కోసం అడగడానికి 'యుకాటెక్ చ చాక్' అనే వేడుక నిర్వహిస్తారు. ఇది వర్ష దేవతలకు ఒక ఉత్సవ విందుపై కేంద్రీకృతమై ఉంది. ఇందులో నలుగురు అబ్బాయిలు (ప్రతి కార్డినల్ పాయింట్‌కి ఒకరు) కప్పలుగా నటించడంతో పాటు వర్షం కురిపించి, పంటలు బాగా పండించాలని పాటలు పాడతారు. ఇది 16వ శతాబ్దపు యుకాటాన్‌లోని సెనోట్స్‌లో జరిగిన ఆచారాల ఉద్దేశ్యం కాగా యువకులను, స్త్రీలను ఈ బావులలోకి దింపి, తద్వారా వారు వరుణ దేవతల రాజ్యంలోకి ప్రవేశించారు.

ఆవిష్కరణ విషయానికొస్తే.. వాషింగ్టన్ పోస్ట్ రిపోర్ట్ ప్రకారం, గుహలో కనుగొనబడిన కొన్ని ఎముకలు గుహ నుంచి 200 మైళ్ల దూరంలో నివసించిన వ్యక్తులవి. కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఎముకలపై జరిపిన లోతైన విశ్లేషణ ప్రకారం.. బాధితులు చంపబడేందుకు ముందు నోరు మూసుకున్నారని తేలింది. అంతేకాదు బలి ఇవ్వబడిన వారిలో కొందరి దంతాల్లో ఒక విచిత్రమైన నీలిరంగు తీగను కనుగొన్నారు. అయితే మయాన్ సంస్కృతిలో నీలం ఒక ముఖ్యమైన రంగు. సదరు బాధితుల శరీరాలను దేవతలకు బలిగా ఉపయోగిస్తున్నారని సూచించేందుకే నీలం రంగులో పెయింట్ చేయబడతారని పురావస్తు శాస్త్రవేత్తలు చెప్పారు.



Next Story

Most Viewed