బాస్‌లతో పోలిస్తే కార్మికుల్లోనే ఎక్కువ స్పెర్మ్ కౌంట్

by Disha Web Desk 10 |
బాస్‌లతో పోలిస్తే కార్మికుల్లోనే ఎక్కువ స్పెర్మ్ కౌంట్
X

దిశ, ఫీచర్స్: సిస్టమ్ ముందు కూర్చుని వర్క్ చేసే ఎంప్లాయిస్‌తో పోలిస్తే క్రమం తప్పకుండా బరువులు ఎత్తే కార్మికులు దాదాపు 50 శాతం ఎక్కువ స్పెర్మ్ కౌంట్‌ను కలిగి ఉన్నట్లు గుర్తించింది తాజా హార్వర్డ్ అధ్యయనం. సెక్స్ డ్రైవ్, కండర ద్రవ్యరాశి, స్పెర్మ్ ఉత్పత్తిని నియంత్రించే మేల్ సెక్స్ హార్మోన్ ‘టెస్టోస్టెరాన్’ లెవల్స్ వారిలో అధికంగా ఉన్నట్లు తెలిపింది. స్పెర్మ్ పరిమాణం, చలనశీలత, టెస్టోస్టెరాన్ స్థాయిలు పురుషుల సంతానోత్పత్తికి కీలకం కాగా ప్రపంచవ్యాప్తంగా స్పెర్మ్ గణనలు గత ఐదు దశాబ్దాలుగా దాదాపు సగానికి పడిపోయాయని తెలిపారు శాస్త్రవేత్తలు. పర్యావరణ, ఆహారం, జీవనశైలి ఇందుకు కారణమని అనుమానిస్తున్నారు.

మునుపటి అధ్యయనాలు పురుషుల సంతానోత్పత్తిపై జరిపిన అధ్యయనాల్లో పర్యావరణం, ఆహారం, జీవనశైలిపై దృష్టిపెట్టాయి. కానీ పని సమయంలో శారీరక శ్రమ పురుషుల పునరుత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందని తొలిసారి ప్రకటించింది ఈ అధ్యయనం. ఇందుకోసం 2005 నుంచి 2019 మధ్య సంతానోత్పత్తి కేంద్రంలో చికిత్స పొందుతున్న జంటల్లో 377 మంది పురుషుల నుంచి 950 వీర్యం, కర్తం నమూనాలను సేకరించి విశ్లేషించారు. వీరిలో 12 శాతం మంది తరచుగా పనిలో బరువైన వస్తువులను ఎత్తడం లేదా తరలించడం గురించి నివేదించారు. మిగిలిన పురుషులతో పోలిస్తే వీరిలో 46 శాతం ఎక్కువ స్పెర్మ్ కాన్సంట్రేషన్, 44 శాతం ఎక్కువ మొత్తం స్పెర్మ్ కౌంట్ ఉంది. దీంతో పాటు వయస్సు, బాడీ మాస్ ఇండెక్స్ (BNI), విద్య, జాతి, ధూమపానం గురించి అన్ని వివరాలు సేకరించిన శాస్త్రవేత్తలు.. ఎక్కువ శారీరక శ్రమ చేస్తున్న పురుషుల్లో టెస్టోస్టెరాన్ అధిక స్థాయిలను కలిగి ఉన్నట్లు తెలిపారు. వీరిలో ఫిమేల్ హార్మోన్ ఈస్ట్రోజెన్ కూడా అధికంగానే ఉందని వెల్లడించారు.

Next Story

Most Viewed