చరిత్ర గతిని మార్చిన ప్రేమ.. రాజ్యాలనే వదులుకున్న ప్రముఖులు

by Disha Web Desk 10 |
చరిత్ర గతిని మార్చిన ప్రేమ.. రాజ్యాలనే వదులుకున్న ప్రముఖులు
X

దిశ, ఫీచర్స్ : ప్రేమ ఎంతో గొప్పదని అందరూ అంగీకరిస్తారు. అయితే ఇందులో అనేక కోణాలున్నాయి. స్త్రీ, పురుషుల మధ్య ప్రేమ కేవలం ప్రేమకే పరిమితం కాదు. అందులో శృంగారం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇద్దరూ కలిసి జీవించేందుకు ప్రధాన కారణం అవుతుంది. అందుకే నాటి నుంచి నేటి వరకు చరిత్రలో పుటల్లో ప్రేమ, శృంగారం అనేవి ఏదో ఒక రూపంలో ప్రస్థావించబడుతూ, వర్ణించబడుతూ వస్తున్నాయి. ఒక ముఖం వెయ్యి నౌకలను ప్రయోగించగలిగితే, ఒక శృంగారం చరిత్ర గతినే మార్చగలదు అనేది ఒక ఇంగ్లీష్ సామెత. మనుషులు ప్రేమ కోసం ఎంతటి త్యాగమైన, ఎంతటి దారుణమైనా చేస్తారని మానవ చరిత్రలోని ప్రతి దశలో నిరూపించబడింది. కొందరు ప్రేమకోసం యుద్ధాలు చేస్తే, మరి కొందరు త్యాగాలు చేశారు. ఇంకొందరు రాజ్యాలను వదులుకున్నారు. ప్రాచీన గ్రీకు పురాణాల నుంచి నేటి వరకు చరిత్ర గతిని మార్చిన కొందరి ప్రేమ వ్యవహారాల గురించి తెలుసుకుందాం.

రిచర్డ్ బర్టన్ - ఎలిజబెత్ టేలర్

ఎలిజబెత్ టేలర్, రిచర్డ్ బర్టన్ 1963లో ఎపిక్ మూవీ క్లియోపాత్ర(Cleopatra)లో కీరోల్ పోషించారు. ఆ సందర్భంలో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే షూటింగ్ వేళ వీళ్ల ఎఫైర్ ప్రపంచాన్ని ఆశ్చర్య పరిచింది. వీరి రిలేషన్‌షిప్‌ను నాటి పోప్ కూడా ఖండించాడు. టేలర్ ప్రవర్తనను ‘శృంగార వాగ్రేన్సీ’ అని పోప్ పేర్కొన్నాడు. ఇద్దరు తారలు షూటింగ్ సమయంలో మొత్తం రోజులు కలిసి గడిపారని పుకార్లు వ్యాపించాయి. తర్వాత వీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీరి కారణంగా అప్పటి చిత్ర పరిశ్రమలో ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డుపాలయ్యారు.

కింగ్ ఎడ్వర్డ్ - వాలిస్ సింప్సన్

కింగ్ ఎడ్వర్డ్ VIII తన పాలనలో కొన్ని నెలలపాటు అమెరికన్ సామాజిక వేత్త వాలిస్ సింప్సన్‌ చుట్టూ తిరుగుతూ తన ప్రేమను ప్రతిపాదించాడు. అయితే ఇతని కారణంగా అప్పటికే వివాహం అయిన ఆమె తన రెండవ భర్త నుంచి విడాకులు కోరింది. అయినప్పటికీ ఎడ్వర్డ్ ఆమెను వివాహం చేసుకోలేకపోయాడు. ఎందుకంటే విడాకులు తీసుకున్న ఆమె భర్త జీవించి ఉన్నందున ఇతర వ్యక్తితో వివాహం చెల్లదని చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అనుమతించలేదు. అయితే ఎడ్వర్డ్ మాత్రం తాను ప్రేమించిన స్త్రీని వివాహం చేసుకునేందుకు తన జన్మహక్కు అయిన రాజ్యాన్ని వదులుకుని, పదవీ విరమణ చేయాలని నిర్ణయించుకున్నాడు. తన తమ్ముడు కింగ్ జార్జ్-8కి రాజ కిరీటాన్ని అందించాడు. అయితే కింగ్ జార్జ్ నత్తివాడు కావడంవల్ల చాలా బాధపడేవాడు. అయినా రాజ్యాన్ని నడిపించాడు. ఎడ్వర్డ్ అండ్ సింప్సన్ ఫ్రాన్స్‌లో ఎంజాయ్ చేస్తున్న రోజుల్లో ఇతను ప్రపంచ యుద్ధం ద్వారా దేశాన్ని నడిపించారు.

జార్ నికోలస్ II - అలిక్స్

నికోలస్ II, హెస్సే- డార్మ్‌స్టాడ్ట్‌కు చెందిన జర్మన్ ప్రిన్సెస్ అలిక్స్‌తో ప్రేమలో పడ్డాడు. కానీ రష్యన్ రాజ కుటుంబం ఈ సంబంధాన్ని ఆమోదించలేదు. అయినప్పటికీ కుటుంబంతో సంబంధం లేకుండా వీరు 1893లో నిశ్చితార్థం చేసుకున్నారు. నికోలస్ తండ్రి మరణించిన తర్వాత అతను అలిక్స్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి రష్యా పాలకులుగా సింహాసనాన్ని అధిరోహించారు. అయితే అప్పటికీ రష్యాలో కలహాలు, పేదరికం తాండవిస్తున్నాయి. ఇంతలోనే మొదటి ప్రపంచ యుద్ధం రష్యా పరిస్థితిని మరింత దిగజార్చింది. అయితే ప్రజలు యుద్ధంలో పోరాడుతుంటే.. మరో వైపు నికోలస్, అలిక్స్ సంపన్నమైన రాచరిక పార్టీలను ఆస్వాదించారు. వారు తమ పడవలలో ఎంజాయ్ చేశారు. దీంతో ప్రజల మద్దతును కోల్పోయారు. వారి కుటుంబం మొత్తం 1918లో ఉరితీయబడ్డారు. దీంతో రోమనోవ్స్ రాజవంశం అంతం అయింది.

నెపోలియన్ - జోసెఫిన్

నెపోలియన్ బోనపార్టే ప్రతిష్టాత్మకమైన యువ సైనికుడిగా ఉన్నప్పుడు జోసెఫిన్ అనే ఫ్రెంచ్ సామాజిక కార్యకర్తతో ప్రేమలో పడ్డాడు. ఎన్నో ఆటంకాలు, ప్రతిఘటనను ఎదుర్కొన్న తర్వాత చివరికి 1796లో జోసెఫిన్ అతనిని వివాహం చేసుకోవడానికి అంగీకరించింది. అతని మిలిటరీ క్యాంపెనింగ్ ద్వారా చివరికి వీరు ఫ్రాన్స్ సింహాసనాన్ని దక్కించుకున్నారు. అయితే నెపోలియన్ పాలనా వ్యవహారాలతో ఎక్కువకాలం దూరంగా ఉండాల్సి రావడంతో సంతానం కలగడం లేదని జోసెఫిన్‌ ఆందోళన పడింది. ఆ తర్వాత నెపోలియన్ ఆమెకు విడాకులు ఇచ్చాడు. దీంతో నెపోలియన్ పరిస్థితి మరింత దిగజారింది. యుద్ధంలో సైనిక నష్టాలను చవిచూశాడు. ఫ్రాన్స్ నుంచి బహిష్కరించబడ్డాడు. జోసెఫిన్ తనతో లేనందున కృంగిపోతూ మరణించాడు.

కింగ్ హెన్రీ VIII - అన్నే బోలిన్

వివాహితుడైన రాజు హెన్రీ VIII, అన్నే బోలీన్‌ అనే యువతితో ప్రేమలో పడినప్పుడు, ఆమెను పెళ్లి చేసుకోవడానికి మొదటి భార్యకు విడాకులు ఇవ్వాలనుకున్నాడు. అయితే పోప్ విడాకులు ఇవ్వడానికి అనుమతించలేదు. మతపరమైన రూల్స్ ఒప్పుకోవని చెప్పడంతో, హెన్రీ కేవలం తన ప్రియురాలని వివాహం చేసుకోవడానికి గ్రేట్ బ్రిటన్ కోసం ఒక కొత్త మతాన్ని స్థాపించి, చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్‌ను సృష్టించాడు. ఇది విడాకులను అనుమతించే కాథలిక్కుల మొదటి మత సంస్కరణగా చెప్పొచ్చు.

పారిస్ అండ్ హెలెన్ ఆఫ్ ట్రాయ్

ట్రాయ్‌కు చెందిన హెలెన్ చరిత్రలో అత్యంత అందమైన మహిళల్లో ఒకరిగా ప్రసిద్ధి చెందింది. అప్పటికే ఆమె వివాహమైనప్పటికీ పారిస్ ఆఫ్ ట్రాయ్ ఆమెపై మోజు పెంచుకున్నాడు. దీంతో ఆమెను తనతో పాటు తిరిగి ట్రాయ్‌కు తీసుకెళ్లాడు. అయితే వీరిద్దరూ కలిసి ఇష్టపూర్వకంగా వెళ్లిపోయారా? లేదా ట్రాయ్ ఆమెను కిడ్నాప్ చేశాడా దానిపై భిన్న వాదనలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత వీరి ప్రేమ వ్యవహారంలో గ్రీకులు, ట్రోజన్ల మధ్య రక్తపాత యుద్ధానికి దారితీసింది. ఇందులో పారిస్‌తో సహా వేలాది ప్రాణాలు కోల్పోయారు. దీంతో హెలెన్‌ను ఆమె అసలు భర్త మెనెలాస్ తనతో పాటు గ్రీస్‌కు తీసుకువెళ్లాడు.

Read More: నీతా అంబానీ, ధీరుభాయ్ అంబానీ ఇంట పెద్ద కోడలిగా ఎలా అడుగు పెట్టిందో తెలుసా?




Next Story

Most Viewed