పెరుగు తింటే ప్రమాదమా.. ఎవరు తినకూడదు..

by Disha Web Desk 20 |
పెరుగు తింటే ప్రమాదమా.. ఎవరు తినకూడదు..
X

దిశ, ఫీచర్స్ : వేసవి కాలం ప్రారంభం కాగానే చాలామంది పెరుగు తినడం ప్రారంభిస్తారు. అద్భుతమైన రుచి, చల్లదనం కారణంగా ప్రజలు దీన్ని ఎంతగానో ఇష్టపడతారు. ఈ సీజన్‌లో పెరుగు తినడం వల్ల అలసట, బలహీనత, వేడి కారణంగా వచ్చే చర్మ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వేసవి కాలంలో శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉండే వాటిని మనం ఆహారంలో చేర్చుకోవాలి. అయితే కొంతమంది వేసవి కాలంలో అధికంగా పెరుగు తినడం ప్రారంభిస్తారు. ఇది వారికి హాని కలిగిస్తుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. శరీరాన్ని చల్లగా ఉంచే పెరుగు ఎలా హాని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

పెరుగులోని పోషకాలు..

ప్రోటీన్, కార్బోహైడ్రేట్, కాల్షియం, విటమిన్ బి6, విటమిన్ సి, ఎ వంటి అనేక రకాల పోషక మూలకాలు పెరుగులో ఉన్నాయి. చాలా పోషకాలు ఉన్నప్పటికీ పెరుగు కొంతమందికి హానికరం. ఇది వారి శరీరంలో నొప్పి, తిమ్మిర్లు, వాపులకు కారణమవుతుంది.

పెరుగు ఎవరు తినకూడదు ?

పెరుగులో యూరిక్ యాసిడ్ పుష్కలంగా దొరుకుతుంది. దీని వల్ల కొంతమందికి హాని కలుగుతుంది. అందుకే ఇప్పటికే యూరిక్ యాసిడ్‌తో బాధపడుతున్న రోగులు పెరుగు తినకుండా ఉండాలి. అలాగే ఈ వ్యాధులతో బాధపడేవారు కూడా పెరుగుకు దూరంగా ఉండాలి.

ఆస్తమా రోగులు..

పెరుగు శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అందుకే ఆస్తమా రోగులు పెరుగును తినకూడదని చెబుతున్నారు నిపుణులు. పెరుగు తినడం వల్ల వారి సమస్య మరింత తీవ్రమవుతుందంటున్నారు.

మలబద్ధకం, అజీర్తి సమస్య..

పెరుగులో సంతృప్త కొవ్వులు ఉంటాయి. దీని కారణంగా మోకాళ్లలో నొప్పి, వాపు సమస్య పెరుగుతుంది. అలాగే పెరుగు జీర్ణం కావడానికి సమయం పడుతుంది. దీని కారణంగా కొంతమంది అజీర్ణం, మలబద్ధకంతో బాధపడవచ్చు. ఇప్పటికే మలబద్ధకం లేదా జీర్ణ సమస్యలు ఉన్నవారు పెరుగు తినకుండా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

ఉబ్బరంతో కడుపు నొప్పి..

పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇది శరీరాన్ని లోపలి నుండి చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే కొంతమందికి ఇది ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలను కలిగిస్తుంది. ప్రతిరోజూ పెరుగును ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు కూడా వస్తాయి.

Next Story

Most Viewed