వివాహబంధాన్ని దెబ్బతీసేది ఆ అలవాట్లే.. నిర్లక్ష్మం చెయ్యకుండా జాగ్రత్త వహించడం మంచిది!

by Disha Web Desk 7 |
వివాహబంధాన్ని దెబ్బతీసేది ఆ అలవాట్లే.. నిర్లక్ష్మం చెయ్యకుండా జాగ్రత్త వహించడం మంచిది!
X

దిశ, ఫీచర్స్: భారతదేశంలో వివాహ బంధానికి చాలా గౌరవం ఉంది. అయితే.. పెళ్లికి ముందు, పెళ్లైన కొత్తలో ఉండే ప్రేమలు, ఆప్యాయతలు, పలకరింపులు, గౌరవం, బంధం ఇవేవి కూడా వివాహం అనంతరం ఉండటం లేదు. అంతే కాకుండా భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిని మరొకరు దూషించుకుంటూ చిన్న సమస్యను కూడా పెద్దది చేసుకుని విడాకుల వరకు వెళ్తున్నారు. దీంతో కుటుంబంతో పాటు పిల్లలు భవిష్యత్తుపై కూడా ఈ ప్రభావం పడుతుంది. అయితే.. భార్యాభర్తల మధ్య గొడవలకు ప్రధానంగా ఈ లక్షణాలే కారణం అని చెబుతున్నారు మానసిక వైద్యులు. వీటి విషయంలో జాగ్రత్త వహించకుండా నిర్లక్ష్యం చేస్తే.. బంధాలు విడిపోయే ప్రమాదం కూడా ఉంటుందట. ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* మొదటగా.. భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు వాళ్ల ఇద్దరే దానికి పరిష్కారం చూసుకోవాలి. అలా కాకుండా కొందరూ భార్య/భర్త మూడో వ్యక్తిని వారి సంసారంలోకి, గొడవల్లోకి తీసుకొస్తారు. భార్యాభర్తల మధ్య గొడవల్లోకి మూడో వ్యక్తి రావడం మరింత ప్రమాదకరం. అది గొడవను చిన్నది చెయ్యడంలో సహాయం చెయ్యకపోగ.. పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. కాబట్టి.. మూడో వ్యక్తితో పంచుకునే అలావాటు ఉంటే అది వెంటనే మార్చుకోండి. మీకు మీరు సర్థిచెప్పుకునే ప్రయత్నం చెయ్యండి.

* ఇక పత్రి సంభాషణ గొడవకు దారి తియ్యకూడదు. ఒకరు ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు అది మీకు నచ్చకపోతే.. తర్వాత మాట్లాడదాం అని చెప్పి అంతటితో ఆపేయాలి. కానీ ఇష్టం లేకుండా వాదించడం కారణంగా అది మరింత కోపాన్ని పెంచే అవకాశం ఉంటోంది.

* ముఖ్యంగా భార్యాభర్తల గొడవల మధ్యలో ఒకరి కుటుంబాన్ని మరొకరు వేలెత్తి చూపించే అలవాటు అస్సలు ఉండకూడదు. భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలకు 50% ఇవే ముఖ్య కారణాలు.

* అలాగే.. మీ భాగస్వామితో ప్రతీ విషయం షేర్‌ చేసుకోండి. ఎప్పుడూ కోపంగా మాట్లాడవద్దు. మీ భాగస్వామిని అర్థం చేసుకునేలా వివరించండి. కానీ కోపం తెచ్చుకుంటే మొత్తానికే మోసం అవుతుంది.

* మీ భాగస్వామి బాధపడితే వారికి తోడుగా నిలబడి.. ధైర్యం చెప్పి దగ్గరకు తీసుకోండి. ఇలా చెయ్యడం వల్ల వైవాహిత జీవితం మెరుగుపడుతోంది.

* ఇక ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా మంది మొబైల్ ఫోన్లకు ఎక్కువ అలవాటు పడుతున్నారు. ఇది ప్రధాన సమస్యగా మారిపోతుంది. భాగస్వామితో సమయం గడపకుండా.. ఫోన్లు చూసుకుంటూ ఉండటంకారణంగా వారి వైవాహిక జీవితం నెగిటివ్‌గా మారుతుంది. మీరు మీ భాగస్వామితో సమయం గడపాలి. ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోండి. ఇలా చెయ్యడం వల్ల వైవాహిక జీవితాల్లో గొడవలు తగ్గి.. ప్రేమాభిమానాలు పెరుగుతాయి.

Next Story

Most Viewed