ప్రతిరోజు బిస్కెట్లు తినడం ఆరోగ్యానికి మంచిదేనా..?

by Disha Web Desk 11 |
ప్రతిరోజు బిస్కెట్లు తినడం ఆరోగ్యానికి మంచిదేనా..?
X

దిశ, వెబ్ డెస్క్: ఈ రోజుల్లో బయట మార్కెట్ లో రకరకాల బిస్కెట్ ప్యాకెట్స్ దొరుకుతుంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఈ బిస్కెట్స్ ను వారి తల్లిదండ్రులు కొనిస్తుంటారు. ప్రతి రోజు స్కూల్ కు వెళ్లేటపుడు బిస్కెట్ ప్యాకెట్ ఇప్పించి పంపడం చూస్తూనే ఉంటాం. అయితే బిస్కెట్ లు ఎక్కువ తినడం వలన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రకరకాల క్రీమ్ లు బిస్కెట్స్ మద్యలో ఉండి మార్కెట్ లో దొరుకుతుంటాయి. ఇవి ఇంకా డేంజర్ అని వైద్యులు చెబుతున్నారు.

ఎక్కువగా బిస్కెట్లు తినేవారిలో కడుపు కడుపు నొప్పి, అజీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మలబద్దక సమస్య వచ్చి ఇబ్బంది పడతారు. చాలా మంది టీలు, కాఫీలలో బిస్కెట్లను తీసుకుంటూ ఉంటారు. అలాంటి వారికి ఉదర భాగంలో మంట, గొంతు పట్టేయడం, ఆకలి వేయకపోవడం వంటివి జరుగుతుంటాయి. అందుకే వీలైనంత వరకు తక్కువగా బిస్కెట్లను తినడం మంచిది.

Read More: వర్షాకాలంలో కలవర పెట్టే కామెర్లు.. అరటి పండు అంత ప్రమాదమా..?

Next Story

Most Viewed