నార్మల్ డెలివరీకి భయపడుతున్న భారతీయ మహిళలు.. అధ్యయనాల్లో షాకింగ్ నిజాలు

by Disha Web Desk 20 |
నార్మల్ డెలివరీకి భయపడుతున్న భారతీయ మహిళలు.. అధ్యయనాల్లో షాకింగ్ నిజాలు
X

దిశ, ఫీచర్స్ : ఒక మహిళ తల్లి అవ్వడం అంటే అది పునర్జన్మతో సమానం అంటారు. బిడ్డకు జన్మనిచ్చేందుకు తల్లి ఎంతో వేదనను భరించాల్సి ఉంటుంది. సాధారణ ప్రసవ సమయంలో మహిళలు నొప్పులు భరించి బాధలు అనుభవిస్తారు. కొన్ని సార్లు క్లిష్టమైన పరిస్థితులు నెలకొంటే వైద్యులు సిజేరియన్ చేసి తల్లీబిడ్డలను కాపాడుతున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. నార్మల్ డెలివరీ అయ్యే పరిస్థితులు ఉన్నా ఆ నొప్పులు భరించేమని కొంతమంది మహిళలు స్వయంగా సిజేరియన్ ఆపరేషన్‌ను ఎంచుకుంటున్నారు. అంతే కాదు పంచాంగం, ముహూర్తం చూపించుకుని సిజేరియన్ చేయించుకుని బిడ్డను భూమ్మీదికి తీసుకువస్తున్నారు.

మరికొన్ని కారణాలతో సొంతంగా సిజేరియన్ ఆపరేషన్ చేయించుకుంటున్న మహిళల సంఖ్య వేగంగా పెరుగుతోందని ఐఐటీ మద్రాస్ పరిశోధనలో వెల్లడైంది. మహిళలు ఈ ఎంపికను ఎందుకు ఎంచుకుంటున్నారు. సాధారణ డెలివరీ నుండి ఎందుకు పారిపోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐఐటీ మద్రాస్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. సిజేరియన్ డెలివరీ అనేది ఒక శస్త్రచికిత్స. ఈ ప్రక్రియలో తల్లి కడుపులో కోత కోసం బిడ్డను తల్లి గర్భం నుండి బయటకు తీస్తారు. ఏమైనా క్లిష్ట పరిస్థితుల్లో ఇలా చేయడం ద్వారా తల్లి బిడ్డ ప్రాణాలు రక్షించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కానీ ఇప్పుడు సాధారణ ప్రసవ సమయంలో కలిగే నొప్పిని భరించలేమని మహిళలు ఎక్కువగా సిజేరియన్ ను ఎంపికను ఎంచుకుంటున్నారు.

సిజేరియన్ డెలివరీ రేటు పెరిగుదల..

2021 వరకు ఐదేళ్లలో భారతదేశంలో సి-సెక్షన్ ప్రాబల్యం 17.2% నుండి 21.5%కి పెరిగింది. ప్రైవేట్ రంగంలో ఈ సంఖ్యలు 43.1% (2016), 49.7% (2021), అంటే ప్రైవేట్ రంగంలో రెండు డెలివరీలలో ఒకటి సి-సెక్షన్ ద్వారా జరుగుతుంది. ఈ పెరుగుదలకు అనేక అంశాలు కారణం కావచ్చు.

పట్టణ ప్రాంతాల్లో నివసించే విద్యావంతులైన మహిళల్లో ఎక్కువ మంది సి-సెక్షన్ ద్వారా ప్రసవించే అవకాశం ఉందని పరిశోధకులు కనుగొన్నారు. సి-సెక్షన్ ప్రాబల్యం పెరగడంలో ఎక్కువ స్వయం ప్రతిపత్తి, ఆరోగ్య సౌకర్యాలకు మెరుగైన ప్రాప్యత పాత్ర పోషిస్తుందని సూచిస్తున్నారు.

ప్రయివేటు ఆసుపత్రుల్లో ఎక్కువగా సి-సెక్షన్లు..

మొత్తం మీద భారతదేశంలో 2016 - 2021 మధ్య చేసిన అధ్యయన కాలంలో ప్రైవేట్ ఆరోగ్య సౌకర్యాలలో ప్రసవించిన మహిళలు సి-సెక్షన్‌ని కలిగి ఉండే అవకాశం నాలుగు రెట్లు ఎక్కువ. ఛత్తీస్‌గఢ్‌లో, ప్రైవేట్ ఆసుపత్రిలో సి-సెక్షన్ ద్వారా మహిళలు ప్రసవాలు జరిగే అవకాశం పది రెట్లు ఎక్కువగా ఉండగా, తమిళనాడులో మూడు రెట్లు ఎక్కువ. ప్రజారోగ్య సౌకర్యాలలో తగిన మౌలిక సదుపాయాలు లేకపోవడమే దీనికి కారణమని పరిశోధకులు తెలిపారు.

నష్టాలు..

వైద్యులు, నిపుణులు ఇద్దరూ నార్మల్ డెలివరీని ఉత్తమమైనదిగా భావిస్తారు. ఎందుకంటే చాలా త్వరగా కోలుకోవడం. ప్రసవం తర్వాత స్త్రీకి ఎక్కువ నొప్పి ఉండదు, అయితే సిజేరియన్ తర్వాత పూర్తిగా కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది.



Next Story