ఫిట్‌నెస్‌‌ మెరుగుదలతో తగ్గుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్.. అధ్యయనం

by Dishafeatures2 |
ఫిట్‌నెస్‌‌ మెరుగుదలతో తగ్గుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్.. అధ్యయనం
X

దిశ, ఫీచర్స్ : వివిధ వ్యాయామాలు, ఫిట్‌నెస్ ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న విషయం మనకు తెలిసిందే. వీటివల్ల హైబీపీ, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కంట్రోల్లో ఉంటాయి. అయితే కేవలం ఫిట్‌నెస్‌ను మరింత మెరుగు పర్చుకోవడంవల్ల పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్రత్యేకంగా కార్డియో యాస్పిరేటరీ ఫిట్‌నెస్‌ కలిగి ఉండటంవల్ల, సంవత్సరానికి 3 శాతం దానిని మెరుగు పర్చుకోవడంవల్ల మూడేళ్లలో ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 35 శాతం తగ్గుతున్నట్లు స్వీడిష్ స్కూల్ ఆఫ్ స్పోర్ట్ అండ్ హెల్త్ సైన్సెస్ పరిశోధకులు వెల్లడించారు.

కొలమానం ఇదే..

కార్డియో యాస్పిరేటరీ ఫిట్‌నెస్ అనేది వాస్తవానికి వ్యాయామం చేసే సమయంలో గుండె, అలాగే ఊపిరితిత్తులు కండరాలకు ఆక్సిజన్‌ను ఎలా అందజేస్తాయనే దానికి కొలమానంగా ఉంటుంది. తాజాగా ప్రొస్టేట్ క్యాన్సర్ నివారణలో ఇది అద్భుతంగా పనిచేస్తుందని పరిశోధకులు గుర్తించారు. ఈ విషయాన్ని తెలుసుకోవడానికి వారు గత కొన్నేండ్లుగా హెల్త్ డేటా బేస్‌లో నమోదు చేసుకున్న 57,000 కంటే ఎక్కువ మంది స్వీడిష్ పురుషులను స్టడీ చేశారు. తీవ్రమైన వ్యాయామం చేసే సమయంలో వారు ఎంత ఆక్సిజన్‌ను ఉపయోగించారో కొలిచారు. ప్రతి ఒక్కరి విషయంలో కనీసం రెండు ఫిట్‌నెస్ టెస్టులను అబ్జర్వ్ చేశారు.

పరిశోధకుల విశ్లేషణ

ఫిట్‌నెస్ టెస్టుల సందర్భంలో కొందరు పురుషులు నిశ్చల స్థితిలో బైక్‌లను నడపడం, జాగింగ్, స్విమ్మింగ్ వివిధ శారీరక వ్యాయామాలు చేయడం వంటివి పరిశోధకులు విశ్లేషించారు. ఆ తర్వాత ప్రొస్టేట్ క్యాన్సర్, ఇతర వ్యాధిని అభివృద్ధి చేసిన పురుషులతో పోల్చారు. అయితే తరచూ ఫిట్‌నెస్‌పై కేంద్రీకరించి మెరుగు పర్చుకుంటున్న ప్రతి 10 వేలమంది పురుషులలో 113 మంది ప్రోస్టేట్ క్యాన్సర్‌ను జయించగలిగారని ఈ సందర్భంగా గమనించారు. కాబట్టి ఫిట్‌నెస్ వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చునని రీసెర్చర్స్ చెప్తున్నారు. ముఖ్యంగా జాగింగ్, హైకింగ్, స్విమ్మింగ్, డ్యాన్స్ వంటి మంచి వ్యాయామాలు ఫిట్‌నెస్ మెరుగుదలకు దోహదం చేస్తాయని నిపుణులు చెప్తున్నారు.



Next Story

Most Viewed