రోజుకు ఇన్ని అడుగులు నడిస్తే ఏ వ్యాధులు మీ దరిచేరవు..!

by Disha Web Desk 9 |
రోజుకు ఇన్ని అడుగులు నడిస్తే ఏ వ్యాధులు మీ దరిచేరవు..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో జీవన శైలిలో మార్పుల కారణంగా చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. కాగా మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే వాకింగ్ అనేది తప్పనిసరి. వ్యాయామం రోగనిరోధక శక్తిని పెంపొందించడమే కాక మరెన్నో ప్రయోజనాలు చేకూరుస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కేలరీలు కరిగించుకోడానికీ, బరువు తగ్గడానికి, మెదడు, గుండె ఆరోగ్యంగా ఉంచడమే కాక ఎటువంటి గాయాలు లేకుండా, మోకాలు, కండరాల నొప్పి రాకుండా ఉంటుంది. అలాగే బీపీ అదుపులో ఉంచడంలో, ఆందోళన తగ్గడానికి వాకింగ్ ఎంతగానో మేలు చేస్తుంది. అయితే రోజుకు ఎన్ని అడుగులు నడిస్తే మంచిదని ఇప్పుడు తెలుసుకుందాం..

* గుండె ఆరోగ్యంగా ఉండడానికి రోజుకు 1000 అడుగులు నడవడం మంచిదట. అలాగే క్యాన్సర్ కూడా రాకుండా ఉంటుందని పరిశోధనలో తేలింది.

* రోజుకు 3800 అడుగులు వేస్తే మెదడు ఆరోగ్యం 25 శాతం పెరుగుతుంది.

* బాడీ ఫిట్‌నెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవారు 10,000 స్టెప్స్ నడవడం మంచిదట. కానీ ఇలా అందరికీ కుదకపోవచ్చు.

* రోజుకు 7000 అడుగులు నడిస్తే ఎక్కువ కాలం జీవిస్తారట.

* లిఫ్ట్ ఎక్కడం మానేసి మెట్లపై నుంచి నడవండి.

* మీకు పెంపుడు జంతువులు ఉంటే.. దాన్ని వాకింగ్ తీసుకెళ్లండి.

* చిన్న దూరాలకు వెళ్లేవారు బండి మీద కాకుండా నడుస్తూ వెళ్లడం మంచిది.

* ఇలా చేయడం వల్ల మీ అడుగుల సంఖ్య పెరుగుతుందని ఫిజిక్ 57 ఇండియా ఓనర్ మళ్లికా తర్కాస్ పారేఖ్ తెలిపారు.

* హెల్తీగా ఉండాలంటే కనీసం రోజుకు 2000 నుంచి 2500 అడుగులు నడవాలి.

* మెడిసిన్ అండ్ సైన్స్ ఇన్ స్పోర్ట్స్ అండ్ ఎక్సర్‌సైజ్ నివేదిక ప్రకారం అరగంటకొకసారి 5 నిమిషాల పాటు నడవడం వల్ల ఎక్కువ సేపు కూర్చుని పని చేసినందుకు అనారోగ్యం బారిన పడే అవకాశాలు తగ్గుతాయి.

* అలాగే షుగర్ లెవల్స్, బీపీ కూడా తగ్గిస్తుంది.

* కాబట్టి ప్రతిరోజూ వ్యాయామం చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Also Read..

వేసవి వేళ కుండలోని పెరుగు తింటే ఎన్ని అద్భుతాలో తెలుసా?

మీ శృంగార శబ్దాల వల్ల నిద్రపట్టడం లేదు.. లేఖ రాసి బీర్లు పంపించిన యువతి.. ట్వీట్ వైరల్

శృంగారంలో పీక్స్ చూస్తున్న మహిళలు.. సెక్స్ కోరికలు పెంచుకునేందుకు ట్రీట్మెంట్‌


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed