ఈ పండును తీసుకుంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..!

by Prasanna |
ఈ పండును తీసుకుంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..!
X

దిశ, ఫీచర్స్ : కివీ పండు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పండు ప్రమాదకరమైన వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కివీస్‌లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. రోజుకు ఒకటి లేదా రెండు కివీలు తినడం మంచిది.

కివీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే విటమిన్ బి6, కార్బోహైడ్రేట్స్, ఫాస్పరస్, మెగ్నీషియం, విటమిన్ సి, ఫైబర్, కాల్షియం, పొటాషియం మొదలైన పోషకాలు ఉన్నాయి. అయితే వివిధ రకాల ఆహారపదార్థాలు తినడం వల్ల లభించే ఈ పోషకాలు ఒక్క కివి తింటే కూడా లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కివీ పండు బ్లడ్ ప్రజర్, స్ట్రోక్ వంటి గుండె సమస్యలను, కిడ్నీలో రాళ్ల సమస్య నుంచి ఉపశమనం పొందేలా చేస్తుంది.

రక్తనాళాలలో రక్తం గడ్డకట్టడం గుండె మెదడుకు రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. కివి రక్తంలో కొవ్వును తగ్గించడం ద్వారా రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. రోజుకు రెండు మూడు కివీలు తినడం వల్ల రక్తం పలచబడి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Next Story