యూట్యూబ్ ద్వారా ఇంత ఈజీగా డబ్బు సంపాదించొచ్చా.. ఫుల్ డిటెయిల్స్ ఖచ్చితంగా తెలుసుకోండి..

by Dishafeatures3 |
యూట్యూబ్ ద్వారా ఇంత ఈజీగా డబ్బు సంపాదించొచ్చా.. ఫుల్ డిటెయిల్స్ ఖచ్చితంగా తెలుసుకోండి..
X

దిశ, ఫీచర్స్: మోస్ట్ పాపులర్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్‌కు వరంగా మారింది. వారి ప్రతిభను ప్రదర్శించి ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్‌ను చేరుకునే వేదికను అందిస్తుంది. ఆర్టిస్ట్, గేమర్, కుక్, టెక్నికల్ ప్రొఫెషనల్.. ఇలా ఎవరైనా సరే యూట్యూబ్ చానల్ ప్రారంభించి తమ డొమైన్‌లో ఫేమస్ అయ్యేందుకు హెల్ప్ చేస్తుంది. టాలెంట్‌కు తగిన డబ్బు సంపాదించే అవకాశాన్ని ఇస్తుంది. ఇంతకీ యూట్యూబ్ ద్వారా మనీ ఆర్న్ చేసేదెలా? ఇందుకు సంబంధించిన ఫుల్ డిటెయిల్స్ మీకోసం.

నిజానికి YouTubeలో డబ్బు ఆర్జించడం ఎలా అనేది మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. YouTubeలో మీ ఛానెల్‌ని మానిటైజ్ చేయడానికి, మీరు తప్పనిసరిగా YouTube పార్టనర్ ప్రోగ్రామ్ (YPP)లో మెంబర్ అవ్వాలి. ఇది కంటెంట్ క్రియేటర్స్‌ తమ రీసోర్స్ పొందేందుకు అనుమతిస్తుంది. వారి వీడియోస్‌లో యాడ్స్ ప్లే చేయడం ద్వారా ఆదాయాన్ని పొందే చాన్స్ ఇస్తుంది.

YPPలో చేరేందుకు అర్హత

* మీ ఛానెల్‌కు గత 12 నెలల్లో కనీసం 1000 మంది సబ్‌స్క్రైబర్స్, 4000 వాచ్ హవర్స్ ఉండాలి. గత 90 రోజుల్లో కనీసం మూడు పబ్లిక్ అప్‌లోడ్స్ చేసి ఉండాలి.

* మీ ఛానెల్ తప్పనిసరిగా YouTube కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అండ్ టర్మ్స్‌కు అనుగుణంగా ఉండాలి.

* ఇవన్నీ ఓకే అయితే మానిటైజేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

మానిటైజేషన్‌కు అప్లయ్ ఎలా చేయాలి?

* మీరు మీ YouTube స్టూడియోకి సైన్ ఇన్ చేయండి.

* తర్వాత నావిగేషన్ బార్‌లోని 'కంటెంట్'పై క్లిక్ చేయండి.

* ఏ వీడియోపై డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారో చూజ్ చేసుకోండి.

* ఆపై లెఫ్ట్ మెనులో 'మానిటైజేషన్'పై క్లిక్ చేయండి.

* AdSense ఎకౌంట్ సెటప్ చేయడానికి 'Start'పై క్లిక్ చేసి ఇన్‌స్ట్రక్షన్స్‌కు అనుగుణంగా ఫాలో అయిపోండి.

* మీ ఛానెల్‌ని రివ్యూ చేయడానికి, అప్లికేషన్‌ను అప్రూవ్ చేసేందుకు వెయిట్ చేయండి.

* ఇవన్నీ పూర్తయితే మీరు డబ్బు సంపాదించేందుకు అర్హత పొందినట్లే.


Next Story

Most Viewed