Gastric problem: ఖర్చు లేకుండా గ్యాస్ సమస్యను ఇలా ఈజీగా తగ్గించుకోవచ్చు?

by Prasanna |   ( Updated:2023-07-24 14:58:10.0  )
Gastric problem:  ఖర్చు లేకుండా గ్యాస్ సమస్యను ఇలా ఈజీగా తగ్గించుకోవచ్చు?
X

దిశ, వెబ్ డెస్క్: మనలో చాలా మంది స్పైసీ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. దీని వల్ల గ్యాస్ సమస్యలకు వస్తాయి. కొంత మందిని ఈ సమస్య తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. గ్యాస్‌ పట్టేసింది అని అనిపించగానే వెంటనే గాసి టాబ్లెట్స్ వేసుకుంటారు. కానీ, ఇవి శరీరానికి ప్రమాదకరం. ఖర్చు లేకుండా గ్యాస్ సమస్యను తగ్గించే చిట్కాల గురించి తెలుసుకుందాం..

మంచినీరు

గ్యాస్ సమస్య బాధపడేవారు పరగడుపున రోజూ ఒక గ్లాసు నీళ్లు తాగాలి. ఇలా తాగడం వలన మన శరీరం హైడ్రేటేడ్ గా ఉంటుంది. అలాగే జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.

దోసకాయ

దోసకాయను మన తినే ఆహారంలో వారానికొకసారితీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇది మన శరీరాన్ని కూడా చల్లబరుస్తుంది.అలాగే గ్యాస్ సమస్యలు ఉన్న ఇది మంచి మెడిసిన్ లా పని చేస్తుంది.

నిమ్మ రసం

గ్యాస్ సమస్యతో బాధపడేవారు ప్రతి రోజూ ఒక గ్లాసు లెమన్ వాటర్ తీసుకోండి. దీనిలో ఉండే గుణాలు పొట్ట సమస్యలను తగ్గిస్తాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

Advertisement

Next Story