మగ అయినా గర్భం మోయాల్సిందే.. ఆ పనిలో స్త్రీ చాలా బిజీ..

by Disha Web Desk 7 |
మగ అయినా గర్భం మోయాల్సిందే.. ఆ పనిలో స్త్రీ చాలా బిజీ..
X

దిశ, ఫీచర్స్: జంతు రాజ్యంలో సముద్ర గుర్రాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. పైప్ ఫిష్ కుటుంబానికి చెందిన ఈ జీవుల్లో మగ జంతువులు గర్భం దాల్చి బిడ్డకు జన్మనిస్తాయి. సాధారణంగా సంతానోత్పత్తి కాలంలో నిరంతరం గుడ్లను ఉత్పత్తి చేయడంలో స్త్రీ బిజీగా ఉంటే.. ఆ గుడ్లు అభివృద్ధి చెందడానికి మేల్ సీ హార్స్ ‘బ్రూడ్ పౌచ్‌’లోకి బదిలీ చేయబడతాయి. 14 నుంచి 28 రోజుల వరకు ఉండే గర్భధారణ సమయంలో తండ్రి నుంచే ఆక్సిజన్, రక్షణ పొందే గుడ్లు.. ‘ఫ్రై’ అని పిలువబడే చిన్నపిల్లలుగా పుడుతాయి.

అయితే ఈ సంతానం ఎక్కువగా మాంసాహారులకు ఆహారంగా మారుతుండగా.. కొన్ని మాత్రమే బతికి బయటపడి యుక్తవయసుకు చేరుకుంటాయి. గుడ్లను తన సహచరుడికి పంపడం ద్వారా ఫిమేల్ సీ హార్స్ .. వెంటనే ఎక్కువ గుడ్లను ఉత్పత్తి చేసేందుకు తన శక్తిని వినియోగిస్తుంది. కాబట్టి బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే మగ సముద్ర గుర్రం మళ్లీ గర్భం దాల్చుతుంది. ఇలా నిరంతర గుడ్ల ఉత్పత్తి, సంతానోత్పత్తి ప్రక్రియ ద్వారా మాంసాహారుల నుంచి జీవించగల పిల్లల సంఖ్యను పెంచుతాయి. తమ జాతి మనుగడకు కారణం అవుతాయి.

ఇవి కూడా చదవండి: తీహార్ జైలు నుంచే బాలీవుడ్ హీరోయిన్స్‌‌తో సుఖేశ్ డేటింగ్!

Next Story

Most Viewed