సజ్జల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే

by Disha Web Desk 10 |
సజ్జల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే
X

దిశ, వెబ్ డెస్క్ : 100 గ్రాముల సజ్జలలో 3 మి.ల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది. రక్తహీనతతో బాధ పడే వారు సజ్జలతో తయారు చేసిన పదార్ధాలు తినడం మంచిది. సజ్జలలో విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్స్ పీచు పదార్ధం ఎక్కువగా ఉండటం వలన ఆహారం నిదానంగా జీర్ణమై చక్కెర నిల్వలు నెమ్మదిగా విడులవుతాయి. సజ్జ పిండిలో బెల్లం కలిపి రొట్టెలా చేసుకొని తినడం వలన రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వుని తగ్గించి రక్తంలోని కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. సజ్జలలో ఇనుము అధికంగా ఉంటుంది. కాబట్టి పిల్లల్లో రక్త హీనతను నివారిస్తుంది. అంతే కాకుండా ఎసిడిటీ , కడుపులో మంట అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచుతుంది.

ఇవి కూడా చదవండి: పుచ్చకాయ జ్యూస్‌లో తేనె కలిపి తాగుతున్నారా?

Next Story

Most Viewed