ఈ పొజిషన్స్‌లో నిద్రపోయే వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా..

by Disha Web Desk 4 |
ఈ పొజిషన్స్‌లో నిద్రపోయే వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా..
X

దిశ, ఫీచర్స్ : మనం పడుకునే విధానం కూడా మన వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తుందని చెబుతున్నారు స్లీప్ సైకాలజిస్టులు. రకరకాల స్లీప్ పొజిషన్స్‌ను బట్టి క్యారెక్టర్‌ను డిసైడ్ చేయొచ్చని చెప్తున్నారు.

బోర్లా పడుకోవడం :

కొంతమందికి బోర్లా పడుకోవడమంటే చాలా ఇష్టం. ఇక అలాంటి వారు ఎక్కువగా రిస్క్ తీసుకునేందుకు ముందుంటారు. అత్యంత ఉత్సాహవంతులు కూడా, ఇక ఎటువంటి సమస్యలనైనా పరిష్కరించే గుణం వీరిలో ఉంటుంది. దీంతోపాటు వీరు శక్తివంతంగా, ఉత్సాహంగా ఉండేందుకు ఖచ్చితంగా 8గంటలు నిద్రపోడానికి మొగ్గుచూపుతారు.

పక్కకు తిరిగి పడుకోవడం :

ఇక చాలా మంది వ్యక్తులు వారి అలవాటు ప్రకారం కుడి వైపుకు లేదా ఎడమ వైపుకు తిరిగి పడుకుంటారు. ఇలాంటి వారిని ప్రశాంతమైన, నమ్మకమైన వ్యక్తులుగా చెప్తున్న నిపుణులు.. వీరిలో అందరితో కలిసిపోయే తత్వం ఉంటుందంటున్నారు. వీరు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ముఖంపై చిరునవ్వు అలాగే ఉంటుందని... భవిష్యత్తు గురించి భయపడరని చెప్తున్నారు.

ముడుచుకుని పడుకోవడం :

కొందరు కాళ్లు, చేతులు దగ్గరగా ముడుచుకొని పడుకుంటారు. ఇక అలా నిద్రపోయేవారు జీవితంలో రక్షణ, సౌకర్యాలను ఎక్కువగా కోరుకుంటారు. దీంతోపాటు వీరు అత్యంత సున్నితమైన వ్యక్తులు.. ఇతరుల చేతిలో త్వరగా మోసపోతారు. అందువల్ల ఒక్కోసారి ఇతరులను నమ్మడం చాలా కష్టంగా ఉంటుంది.

వెల్లకిలా పడుకోవడం :

ఇలా నిద్రపోయేవారికి బలమైన వ్యక్తిత్వం ఉంటుంది. దీంతోపాటు ఫుల్ ఎనర్జీగా ఉండే అవకాశం ఉందని స్లీప్ సైకాలజిస్ట్స్ చెప్తున్నారు. అలాగే వీరు వీరిలా ఆలోచించే వ్యక్తులతోనే ఉండేందుకు ఆసక్తి చూపిస్తారు. అందరిలో కంటే తామే ఆకర్షణీయంగా కనిపించాలని చూస్తారు. ఇతరుల నుంచి కూడా ఎక్కువ అంచనాలు పెట్టుకుంటారు.

చేతులు చాచి నిద్రపోయేవారు :

ఇక చేతులు చాచి నిద్రపోయే వ్యక్తులు ఇతరులను అనుమానిస్తూనే ఉంటారు. తమ స్వంత నిర్ణయాలు, ఆలోచనలను నిష్టగా పాటిస్తారు. దీంతోపాటు ఇతర వ్యక్తుల అభిప్రాయాలకు పెద్దగా విలువనివ్వరు.


Next Story

Most Viewed