అతి ప్రేమ కూడా ఓ జబ్బే.. సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడి?

by Disha Web Desk 8 |
అతి ప్రేమ కూడా ఓ జబ్బే.. సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడి?
X

దిశ, ఫీచర్స్ : ప్రేమిచడం అనేది చాలా కామన్. ఎంతో మంది ప్రేమిస్తుంటారు, ప్రేమించబడుతారు. అయితే ప్రేమ కొంతమందిని బలమైన వ్యక్తులుగా మార్చితే మరికొంత మందిని ఓ జబ్బు బారిన పడేలా చేస్తోంది.ముఖ్యంగా అతి ప్రేమ అనేది చాలా ప్రమాదకరం అంట. దీని వలన చాలా సమస్యలు ఏర్పడుతయని చెబుతున్నారు నిపుణులు. చైనాలో ఓ యువతి లవ్ బ్రేయిన్ డిజార్డర్‌తో బాధపడుతోంది.

అసలు విషయంలోకి వెళ్లితే..చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో జియావు అనే 18 ఏళ్ల యువతి ఒక వ్యక్తిని ప్రేమించింది. అతని మీద పిచ్చి ప్రేమను పెంచుకుంది. చివరికి అదే పిచ్చిగా మారిందని, మానసిక రుగ్మతతో బాధపడుతుందని వారు తెలిపారు.అయితే ఆమె ఒక వ్యక్తిని ఎంతో ప్రేమించింది. అతనంటే పిచ్చి ప్రేమ, కాలేజీకి వెళ్లగానే అతన్నే వెతకడం.. పదే పదే అతన్నే చూడటం,అతనితో ఊకే మాట్లాడటం చేసేది. అంతే కాకుండా ఒక రోజు వంద కాల్స్, వేల మెసేజెస్ చేసేది. దీంతో ఆమె బాధను తట్టుకోలే ఆయన ఆ అమ్మాయిని దూరం పెట్టాడు. దీంతో అతని ఎడబాటు తట్టుకోలేక ఆమె పిచ్చిదై పోయింది. కొన్ని వేలసార్లు కాల్స్ చేస్తూ ఉండేది. ఇక దీంతో ఆమె లవ్ బ్రెయిన్ డిజార్డర్‌తో బాధపడుతోందని వైద్యులు తెలిపారు.విపరీతమైన ఒత్తిడి ఈ వ్యాధి లక్షణం. అయితే..ఆమెకి ఎందుకీ జబ్బు వచ్చిందనేది మాత్రం ఇంకా తెలియలేదు. చిన్నతనంలో తల్లిదండ్రులతో ఆమెకు అంతగా బంధం లేకపోవడం, వారు ఈమెను ప్రేమగా చూసుకోకపోవడం వలన మానసికంగా ఇలా బలహీనంగా మారిపోయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు వైద్యులు. ఇలాంటి వాళ్లు తమకు తాముగానే మెల్లగా కోలుకుంటారని,కాస్త ఎమోషన్స్‌ని అదుపులో పెట్టుకుంటే చాలని చెబుతున్నారు.



Next Story

Most Viewed