అధిక బరువుకు కారణం అవుతున్న థైరాయిడ్.. తగ్గాలంటే ఏం చేయాలి?

by Dishafeatures2 |
అధిక బరువుకు కారణం అవుతున్న థైరాయిడ్.. తగ్గాలంటే ఏం చేయాలి?
X

దిశ, ఫీచర్స్ : ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మందిని హార్మోనల్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ వేధిస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అలాంటి వాటిలో థైరాయిడ్ ఒకటి. మగవారికన్నా ఆడవారిలోనే ఈ సమస్య ఎక్కువ. భారత దేశంలో అయితే ప్రతీ పది మందిలో ఒకరు దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు. గొంతు ముందు భాగంలో ఉండే గ్రంథినే థైరాయిడ్ గ్రంథి అని, దాని నుంచి ప్రొడ్యూస్ అయ్యేదానినే థైరాయిడ్ హార్మోన్ అని పిలుస్తారు.

శరీరంలో జరిగే మార్పులివే..

థైరాయిడ్ హార్మోన్ ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. కానీ అది హెచ్చు తగ్గులకు గురవుతూ ఉండటమే సమస్యలకు అసలు కారణం. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్ల వల్ల కూడా థైరాయిడ్ సమస్యలు అధికం అవుతున్నాయి. ప్రస్తుతం ఇదొక సాధారణ సమస్యగా మారిపోయింది. థైరాయిడ్ గ్రంథి, థైరాయిడ్ అనే హార్మోన్‌ను నియంత్రించడంవల్ల శరీరంలో వివిధ మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా ఆకలి మందగించడం, అధిక బరువు పెరగడం, మత్తుగా అనిపించడం, అతి నిద్ర వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే దీనివల్ల అధిక బరువు సమస్యను చాలా మంది ఎదుర్కొంటుండగా.. ఇందులో మహిళలే అధికంగా ఉంటున్నారని నిపుణులు చెప్తున్నారు.

పరిష్కారం ఏమిటి?

థైరాయిడ్ హార్మోన్‌లో హెచ్చు తగ్గులను నివారించేందుకు అవసరమైన ఆహారాలు తీసుకోవడంవల్ల సమస్యను నివారించవచ్చునని నిపుణులు చెప్తున్నారు. అందులో భాగంగా కాడ్, ట్యూనా, సాల్మన్ వంటి అయోడిన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న చేపలను తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటంవల్ల థైరాయిడ్ ఇంబ్యాలెన్స్‌ను నివారించడంలో సహాయపడతాయి. అధిక బరువు కూడా తగ్గుతారు. అట్లనే పాల ఉత్పత్తులైన పెరుగు, మజ్జిగ, జున్నులో కూడా అయోడిన్, కాల్షియం మెండుగా ఉంటాయి. తరచుగా తినడంవల్ల థైరాయిడ్ సమస్యలు రావు. అంతేకాకుండా కండరాలు, ఎముకల ఆరోగ్యానికి కూడా మంచిది. సెలీనియం, జింక్ పోషకాలు కలిగిన గుడ్లు, ఇతర కూరగాయలు కూడా థైరాయిడ్ హార్మోన్ వల్ల తలెత్తే అనారోగ్యాలను, అధిక బరువును నియంత్రిస్తాయి.

Next Story

Most Viewed