బ్రెయిన్ షార్ప్‌గా పనిచేయాలా?.. ఇలా చేయడం బెటర్

by Disha Web Desk 10 |
బ్రెయిన్ షార్ప్‌గా పనిచేయాలా?.. ఇలా చేయడం బెటర్
X

దిశ, ఫీచర్స్ : మనం ఏ పనిచేయాలన్నా శరీర భాగాలతో పాటు బ్రెయిన్ హెల్తీగా, యాక్టివ్‌గా ఉండాలి. అప్పుడే సమర్థవంతంగా దూసుకుపోగలం అంటున్నారు నిపుణులు. ఆహారనాళానికి, మెదడుకు మధ్య అనుసంధాన వ్యవస్థ ఉంటుంది. కాబట్టి కొన్ని రకాల ఆహార పదార్థాలు అందుకు దోహదం చేస్తాయని అమెరికాలోని హర్వర్డ్ మెడికల్ కాలేజ్‌కు చెందిన న్యూట్రీషనల్ సైకియాట్రిస్టులు చెప్తున్నారు. పైగా మెదడు, పేగులు ఒకే ఎంబ్రియానిక్ కణాల నుంచి తయారు అవడం కూడా ఇందుకు కారణంగా పేర్కొంటున్నారు. వీటి మధ్య సమాచార మార్పిడి కొన్ని రసాయనిక చర్యలపై ఆధారపడి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆహారాలు కీలకపాత్ర పోషిస్తాయి.

వాస్తవానికి ఆకలి నియంత్రణ, పలు ఇతర జీవక్రియలకు సంబంధించిన 90 శాతం సెరోటోనిన్ హార్మోన్ పేగుల్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఆరోగ్యకరమైన ఆహారాలవల్లే ఇది సాధ్యం అవుతుంది. కాబట్టి హెల్తీ ఫుడ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ ఆహారం ఆరోగ్యకరమైనది కాకపోతే పేగుల్లో మంటతోపాటు డిప్రెషన్, యాంగ్జైటీ వంటి సమస్యలకు దారితీస్తుంది. అందుకే బ్రెయిన్ వర్క్ పర్ఫార్మెన్స్‌ను పెంచడంలో, దానిని యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే ఆహారపు అలవాట్లు కలిగి ఉండటం మేలు చేస్తుంది. ముఖ్యంగా విటమిన్ బి, బి-12, బి-9, బి-1 ఇందుకు దోహదం చేస్తాయి. ఆకు కూరలు, ఆకుపచ్చ కూరగాయాల్లో ఇవి లభిస్తాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి పసుపు, కుంకుమ పువ్వు, వివిధ సుంగధ ద్రవ్యాలు ఆహారంలో భాగంగా ఉండేలా చూసుకోవాలి. ఇక ఈస్ట్ వంటి సూక్ష్మజీవి సంబంధిత పెరుగు వంటి పులియబెట్టిన ఆహారాలు బ్రెయిన్ పవర్‌ను పెంచుతాయి. అలాగే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉన్నందున వాల్ నట్స్ కూడా మేలు చేస్తాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. డార్క్ చాక్లెట్, అవకాడో, తృణ ధాన్యాలు, పచ్చి బఠానీలు, చిక్కుళ్లు, ఆకు కూరలు, పాలు వంటి ఆహారాలు కూడా బ్రెయిన్ యాక్టివిటీస్‌ను ప్రేరేపిస్తాయి.

Read More: ఆత్రుత ఎక్కువైనా ఆరోగ్యంపై ఎఫెక్ట్.. కారణం ఏంటంటే..

ఓల్డేజ్‌‌లో లెర్నింగ్‌‌ యాక్టివిటీస్.. జీవన ప్రమాణాన్ని 19 శాతం పెంచుతాయట

Next Story

Most Viewed