బ్రెయిన్ షార్పుగా పనిచేయాలా?.. ఆహారంలో ఇవి తప్పక చేర్చండి !

by Dishafeatures2 |
బ్రెయిన్ షార్పుగా పనిచేయాలా?.. ఆహారంలో ఇవి తప్పక చేర్చండి !
X

దిశ, ఫీచర్స్ : ప్రతిరోజూ మీరు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలంటే బ్రెయిన్ షార్పుగా పనిచేయాలి. చదివింది గుర్తుండాలంటే విద్యార్థులకు, యాక్టివ్‌గా వర్కు చేయాలంటే ఉద్యోగులకు ఇది మరింత ముఖ్యం. అయితే మనం తీసుకునే ఆహారాలపై కూడా అది ఆధారపడి ఉంటుందని డైటీషియన్లు చెప్తున్నారు. ఎటువంటి ఫుడ్స్, విటమిన్స్, మినరల్స్ తీసుకోవడంవల్ల బ్రెయిన్ యాక్టివ్‌గా ఉంటుందో, జ్ఞాపకశక్తి, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందో సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం.

సాల్మన్ ఫిష్

సాల్మన్ చేపలు రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు మెదడు చురుకుగా పనిచేసేందుకు అద్భుతమైన ఆహారం. వీటితోపాటు ట్రౌట్, సార్డినెస్ వంటి చేపల రకాల్లో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అంతేకాకుండా డొకొసాహెక్సెనోయిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు బ్రెయిన్ హెల్త్‌కు చాలా ముఖ్యం. అందుకే చేపలను ఆహారంలో భాగంగా తీసుకోవడంవల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

విటమిన్ కె, ఫ్లేవనాయిడ్స్

విటమిన్ కె మెదడుకు చాలా అవసరం. దీనివల్ల మెమోరీ పవర్ పెరుగుతుంది. ఇది ఎక్కువగా బ్రొకోలీ ద్వారా లభిస్తుంది. కాబట్టి ఆహారంలో భాగంగా దానిని తీసుకోవాలి. మీ శరీరానికే కాకుండా మెదడుకు కూడా దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బ్రోకలీలో విటమిన్ కె తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జ్ఞాపకశక్తిని పెంచడానికి దోహదం చేస్తాయి. అలాగే డార్క్ చాక్లెట్స్‌లో కూడా కెఫిన్, లో ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉండటంవల్ల మెదడును చురుకుగా ఉంచుతాయి.

కుర్కుమిన్ సమ్మేళనం

కుర్కుమిన్ అనే సమ్మేళనం మెదడును యాక్టివ్‌గా పనిచేసేలా ప్రేరేపిస్తుంది. ఇది ప్రధానంగా పసుపులో ఉంటుంది. నొప్పి నివారణ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఉంటాయి కాబట్టి పసుపును ఆహారంలో భాగంగా వాడుతూ ఉండాలి. దీనివల్ల అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని నివారించవచ్చు. జ్ఞాపకశక్తికి, బ్రెయిన్ హెల్త్‌కు పసుపు చాలా మంచిది. ఇక దీంతోపాటు బ్లూ బెర్రీ కూడా జ్ఞాపకశక్తిని పెంచుతాయి. ఎందుకంటే వీటిలో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మెమోరీ పవర్‌ను పెంచుతాయి.


Next Story

Most Viewed