నిండా ముసుగేసి పడుకుంటున్నారా.. అంతమంచిది కాదంట?

by Disha Web Desk 10 |
నిండా ముసుగేసి పడుకుంటున్నారా.. అంతమంచిది కాదంట?
X

దిశ, ఫీచర్స్: చలి పెడుతుందనో, కంఫర్టుగా ఉంటుందనో నిండా ముసుగేసి పడుకుంటున్నారా? శరీరం మొత్తం కవర్ అయ్యేలా దుప్పటి కప్పుకుంటున్నారా? కానీ ఇలా చేయడం అంత మంచిది కాదని, కొందరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉన్నవారు ఈ పరిస్థితివల్ల నిద్రకు దూరమయ్యే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే నిద్ర, శరీర ఉష్ణోగ్రత మధ్య సంబంధం ఉంటుంది. పాదాలపై దుప్పటి నిండుగా కప్పడం వల్ల బాడీ టెంపరేచర్ అధికంగా ఉన్నవారు తరచూ నిద్ర మేల్కొంటుంటారు. ఒకవేళ పాదాలపై దుప్పటి లేకపోతే బయటి నుంచి గాలి, తేమ తగలడంవల్ల చల్లబడతాయి. ఈ పరిస్థితి మరింత నాణ్యమైన నిద్రను ప్రేరేపిస్తుందని, దీనివల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెప్తున్నారు. అలాగే క్వాలిటీ స్లీప్ కోసం పడుకోవడానికి అరగంట ముందు నుంచి మొబైల్ ఫోన్‌‌ వాడకపోవడం, కాఫీ, టీలు తాగకపోవడం మంచిది. ప్రతిరోజూ నిద్రపోయే సమయం ఒకే విధంగా ఉండేలా సెట్ చేసుకోవడం మంచిది. నైట్ షిఫ్టులు లేని జీవన శైలి కలిగిన వారు రాత్రి 9 నుంచి 10 గంటలలోపు నిద్రకు ఉపక్రమిస్తే మరుసటి రోజూ యాక్టివ్‌గా ఉండగలుగుతారు.

Read More: ఆక్టోపస్‌ను మింగి అవస్థలు పడ్డ సింగపూర్ వ్యక్తి.. డాక్టర్లు ఏం చేశారంటే?

Next Story

Most Viewed