ఎక్కిళ్లు అతిగా వస్తున్నాయా? అది ప్రమాదకర వ్యాధికి సంకేతం!

by Disha Web Desk 7 |
ఎక్కిళ్లు అతిగా వస్తున్నాయా? అది ప్రమాదకర వ్యాధికి సంకేతం!
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా చాలా మందికి తినేటప్పుడు, తాగేటప్పుడు ఎక్కిళ్లు వస్తుంటాయి. అలాంటి సమయాల్లో ఎవరో మనల్ని తలుచుకుంటున్నారనో లేక ఇంకేదో కారణాలు చెప్తారు పెద్దలు. కానీ, నిజానికి ఎక్కిళ్లు ఎందుకు వస్తాయి అనేది స్పష్టంగా ఎవరికీ తెలియదు. అయితే కొందరికి మాత్రం అదే పనిగా ఎక్కిళ్లు వస్తూనే ఉంటాయి. అది బాడీలీటిక్ క్యాన్సర్‌కు సంకేతం కావచ్చని క్యాన్సర్ రీసెర్చ్ వెల్లడించింది. ఈ మేరకు అమెరికన్ జర్నల్ ఆఫ్ హాస్పైస్&పాలీయేటివ్ మెడిసిన్‌లో తెలిపిన ఓ అధ్యయనం ప్రకారం.. అసలు ఎక్కిళ్లు క్యాన్సర్‌కు ఎందుకు కారణమో తెలుసుకుందాం.

అధ్యయనం ప్రకారం.. క్యాన్సర్‌‌తో బాధపడుతున్న రోగులను పరీక్షించగా అందులో 40 శాతం మంది ఎక్కిళ్ళు సమస్యతో బాధపడుతున్నట్టు తేలింది. అంతే కాకుండా క్యాన్సర్ రోగులకు ఎక్కిళ్లు దాదాపు 48 గంటలకు పైగా వస్తాయట. ఛాతి, గొంతు లేదా తల క్యాన్సర్ ఉన్న వ్యక్తులకు కూడా ఎక్కిళ్ళు ఎక్కువగా రావచ్చని అట్లాంటిక్ నివేదించింది. క్యాన్సర్ రోగులకు సూచించిన మందులు స్టెరాయిడ్స్, కీమోథెరపీ, ఓపియాయిడ్లతో వీటిని తగ్గించుకోవచ్చు. ఇక మరొక అధ్యయనం ప్రకారం.. దాదాపు 320 మంది క్యాన్సర్ రోగులపై చేసిన పరీక్షల ప్రకారం ఎక్కిళ్లు 10 మందిలో ఒకరిని ఆసుపత్రి బారిన పడేలా చేస్తున్నాయి. కాగా.. 48 గంటలు ఏకదాటిగా ఎక్కిళ్లు వస్తున్నట్లయితే వైద్యులను సంప్రదించడం మంచిది.

అసలు ఎక్కిళ్ళు రావడానికి ప్రధాన కారణాలు ఏంటంటే..?

* గాలి ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పులు

* త్వరగా తినడం, తాగడం

* ఒత్తిడి

* మెడ మీద అధిక ఒత్తిడి

* రోగానికి వినియోగించే కొన్ని మందులు

* మద్యం సేవించడం

* పొట్ట ఉబ్బి ఇబ్బందిగా ఉన్నప్పుడు

నోట్: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కొరకు ఇచ్చినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి మార్పులు వచ్చిన వైద్యుడుని సంప్రదించడం మంచిది.

ఇవి కూడా చదవండి: వేసవిలో ప్లాస్టిక్ బాటిల్‌లో వాటర్ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా?

Next Story

Most Viewed