Dogs: కుక్కలు ఎందుకు ఏడుస్తాయో తెలుసా ?

by Disha Web Desk 10 |
Dogs: కుక్కలు ఎందుకు ఏడుస్తాయో తెలుసా ?
X

దిశ,వెబ్ డెస్క్ : కుక్క అరుపులు ఎప్పుడైనా బాగా విన్నారా ? అవి మొరిగినా కూడా మనకి ఒక్కోసారి భయంగా అనిపిస్తుంటుంది. కానీ కుక్కలకు ఆత్మలు కనపడుతాయని కొంత మంది అంటుంటారు.. అవి కనిపించినప్పుడు మాత్రమే ఏడుస్తాయని చెబుతుంటారు. కుక్కల ఏడుపును అశుభంగా భావిస్తారు. పగటి పూట కుక్కలు ఏడిస్తే ప్రజలు కర్రతో తరుముతుంటారు.అసలు కుక్కలు ఎందుకు ఏడుస్తాయంటే? వేరే కుక్కలకు సందేశం ఇవ్వాలనుకునప్పుడే ఏడుస్తాయట.

ఇంట్లో పెంచుకునే కుక్కల కళ్లలో నుంచి నీళ్లు రావడం లేదా తినడం, తాగడం మానేస్తే ఇంట్లో బాధలు ఎక్కువవుతాయట.ఒంటరిగా ఉన్నా అని ఫీల్ అయ్యేవారు కుక్కలు పెంచుకోవడం మంచిదట. ఇలాంటి వాళ్ల పై పరిశోధనలు చేసి ఒంటరిగా ఉండి కుక్కలను పెంచుకునే వారి మరణాలు 15 శాతం కన్నా తక్కువేనని తేలాయి. అలాగే గుండె జబ్బులు రాకుండా ఉంటాయట.



Next Story

Most Viewed